అభిమానుల కోసం విజయ్ దేవరకొండ..సంచలన నిర్ణయం..!?

జీవితంలో ఏది చేయాలనుకున్నా, వాట్‌ లగా దేంగే అంటూ.. కొద్ది రోజుల క్రితం తెగ హడావిడి చేసిన విజయ్‌ దేవరకొండ కొంచెం నేల మీదకి వచ్చాడనే చెప్పాలి. ‘లైగర్‌’ సినిమా ప్లాప్‌తో విజయ్‌ దేవరకొండ తాన‌ తర్వాతి సినిమాల విషయంలో చాలా ఆచి తూచి అడుగులువేస్తున్నారని తెలుస్తుంది. విజయ్ ఇప్పటివరకు తీసిన సినిమాలు కాకుండా ప్రేమకథలు తీయాలని భావిస్తున్నారట. విజయ్ తన తర్వాతి సినిమాలను ఎక్కువ శాతం ప్రేమ కథలే ఉండేటట్టు చూసుకుంటున్నాడట.

Vijay Deverakonda tells Karan Johar why he won't reveal who he's dating |  Web Series - Hindustan Times

విజయ్ దేవరకొండ లైగర్‌ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడు ఖుషి సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్. ఈ సినిమా చాలా భాగం షూటింగ్ ముగించుకొని విడుదలకు సిద్ధమవుతుంది. దింతో విజయ్ తన అభిమానుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటివరకు తీసిన సినిమాలు కన్నా ఇప్పుడు నుంచి తీసే సినిమాలు చాలా కొత్తగా ఉంటాయని. అభిమానులని తాన సినిమాల‌తో హర్ట్ చేయన‌ని మాట పడకుండా చేస్తానని. లైగర్ లాంటి మిస్టేక్ ఎప్పుడు చేయనని. అభిమానులకి మాటిచ్చాడట.

Kushi First Look Motion Teaser | Vijay Devarakonda | Samantha | Manastars -  YouTube

విజయ్ అన్న మాటలు బయటకు రావడంతో ఆయ‌న ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా విజయ్ అభిమానులు ఆయ‌న‌ ఖుషి సినిమాలో హిట్ కొడతారని చాలా ఆశలు పెట్టుకున్నారు..ఖుషి సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లో క్రియేటివ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్ర గంటితో సినిమాా చేస్తున్నారట. మరి చూడాలి విజయ్ ప్రేమ కథలతో ఏమాత్రం మెప్పిస్తాడు అభిమానులని.

Share post:

Latest