“నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా..”..టాలెంటెడ్ హీరోయిన్ ని అవమానించిన స్టార్ డైరెక్టర్..!?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. స్కూల్ కి వెళ్లే పిల్లలకి చాక్లెట్ ఇచ్చి యామార్చినట్టు.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను అవకాశాల పేరుతో కొందరు డైరెక్టర్లు వాడుకుంటున్నారు. ఇదే విషయాన్ని గత కొంతకాలం నుంచి సెలబ్రిటీస్ ,స్టార్ హీరోయిన్స్..నెత్తి నోరు మొత్తుకున్నా కానీ ఎవరు వినిపించుకోవట్లేదు. సినీ పెద్దలం మేము అంటూ చెప్పుకొని విర్ర వీగే స్టార్ హీరోస్ కూడా కాస్టింగ్ కౌచ్ దగ్గరకు వచ్చేసరికి ఫేస్ తిప్పేసుకుంటున్నారు. వాళ్ళ సినిమాలు హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయా రెమ్యూనరేషన్ తీసుకున్నామా సినిమా ప్రమోషన్లు చేసుకున్నామా.. వాళ్ళ కొడుకుల్ని లైఫ్ లో సెటిల్ చేసామా.. ఇదే ఆలోచనలతో ఉన్నారు.

అయితే సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న పెద్దాయన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను “నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా ..?”అంటూ దారుణంగా అవమానించారు అంటూ ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది .దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే ఐశ్వర్య చూడటానికి కొంచెం రంగు తక్కువ కానీ టాలెంట్ లో మాత్రం ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ అని చెప్పుకుంటున్న హీరోయిన్స్ కి మించి ఉంది. అయితే సినీ ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్ కి సెలెక్ట్ అవ్వాలంటే కచ్చితంగా అందంగా ఉండాలి . దానికి తగ్గ ఫిజిక్ ను మైంటైన్ చేయాలి అప్పుడే ఇండస్ట్రీలో వాళ్లను పైకి ఎదగనిస్తారు. కొంచెం రంగు తక్కువ ఉన్న డైరెక్టర్ లు చెప్పిన మాట వినకపోయినా.. వాళ్లను స్టార్టింగ్ లోనే తొక్కిస్తారు. అలాంటి స్టార్ డైరెక్టర్ క్రూరత్వానికి బలైపోయింది ఐశ్వర్య.

ఐశ్వర్య రాజేష్ తెలుగు జనాలకు బాగా సుపరిచితురాలు. తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ సొంత టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చింది . అయితే కెరియర్ స్టార్టింగ్ లో ఐశ్వర్య రాజేష్ తెలుగు డైరెక్టర్ హీరోయిన్గా అవకాశం ఇస్తాను అంటూ పిలిచి దారుణంగా బిహేవ్ చేశారట . ఈ క్రమంలోనే ఆమె నో చెప్పడం “ఫేస్ అద్దంలో చూసుకున్నావా నువ్వు హీరోయిన్గా పనికిరావు”.. అంటూ చెత్త వాగుడు వాగి ఆమెను స్టూడియో నుండి బయటికి గెంటేసాడట. దీంతో అప్పుడు ఐశ్వరరాయ్ చాలా బాధపడిందట. అంతేకాదు ఆ తర్వాత చాలామంది కూడా ఇలాగే తనతో మిస్ బీహేవ్ చేయడానికి ట్రై చేశారని.. కానీ ఆమె ఒప్పుకోలేదట. సినీ ఇండస్ట్రీలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా కానీ ఐశ్వర్య రాజేష్ తన సొంత టాలెంట్ తోనే పైకి వచ్చింది . తెలుగులో కూడా బోలెడు సినిమాలో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది .టెక్నాలజీ ఇంత పెరుగుతున్న కాలం ఎంత మారుతున్న ఇంకా అందం చూసి హీరోయిన్గా అవకాశాలు ఇస్తున్న డైరెక్టర్లు మన ఇండస్ట్రీలో ఉన్నారంటే అది మన ఇండస్ట్రీకి సిగ్గుచేటు అంటున్నారు నెటిజన్స్.

Share post:

Latest