సమంత జీవితంతో ఆటలు ఆడుతున్న స్టార్ ప్రొడ్యూసర్..నాగార్జున హస్తం ఉందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ పాన్ ఇండియా సినిమా `శాకుంతలం`. ఈ సినిమా సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెంది. ఈ సినిమాను గుణ టీమ్ వర్క్ బ్యానర్ పై రూపొందించిన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై సమర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ సినిమా మహాభారతంలోని ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతలం దృశ్యంత మహారాజు ప్రేమ కథని ఆధారంగా చేసుకుని గుణశేఖర్ తనదైన రీతిలో సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమాను ఆవిష్కరించబోతున్నాడు.

పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ` శకుంతలం` సినిమాలో శాకంతులగా సమంత నటిస్తుంటే దృశ్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అంటూ అటు సమంత అభిమానులు ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలీదుగానీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆపుతున్నారట.

అయితే డైరెక్టర్ దిల్ రాజ్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి గాను హక్కులు సొంతం చేసుకోవడమే కారణమట. ఇంకా ఈ సినిమా సీజీ వర్క్ లోనే ఉందట. ఇక ఆ మధ్య నిర్మాణంలో భాగమైన దిల్ రాజు కొంత భాగం రష్ చూసి బాగా డిసప్పాయింట్ అయినట్టు ఇక అప్పటినుంచి శాకుంతలం రిలీజ్ విషయం తన చేతిలో పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి.

అసలు నిజానికి ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సింది. ఇలా ఆలస్యం కావడానికి నాగార్జున హస్తం ఉందేమో అంటూ కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేస్తుంది. ఇక పోతే ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతోందని అధికార‌కంగా ప్రకటించడంతో సమంత అభిమానుల సైతం కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest