చిన్న నిర్ణ‌యాలు.. పెద్ద న‌ష్టాలు.. మారేదెప్పుడు జ‌గ‌న్‌..?

ఎక్క‌డైనా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు.. ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొనాల‌ని చూస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల సెంటిమెంటుకు అనుకూలంగానే ప‌నిచేస్తుంది. దీంతో మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు పొరుగున ఉన్న తెలంగాణ , త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఇవే క‌నిపిస్తున్నాయి. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఆరోగ్య శ్రీప‌థ‌కాన్ని మార్చాల‌ని.. కేసీఆర్ అనుకున్నారు.

తొలిసారి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన ఆయ‌న‌.. తెలంగాణ రాకుండా.. అడ్డుకున్న వైఎస్‌ను తీవ్ర‌స్థాయిలో తిట్టిపోశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పెట్టిన ప‌థ‌కం మ‌న‌కు వ‌ద్ద‌ని చెప్పిన‌.. మంత్రుల మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. అయితే.. అప్ప‌టికే.. తెలంగాణ స‌మాజంలో ఆరోగ్య శ్రీ ప‌థ‌కం జోరుగా వెళ్లిపోయింది. ప‌ల్లెలు, గ్రామాలు.. స‌హా అన్ని చోట్లాఆరోగ్య శ్రీ వేళ్లూనుకుపో యింది. దీంతో ఆ ప‌థ‌కాన్ని ఎత్తేస్తే.. దానిని కాంగ్రెస్ అడ్వాంటేజ్‌గా తీసుకుని.. బ‌ల‌ప‌డే ప‌రిస్థితి ఉంద‌ని.. గ‌మ‌నించిన కేసీఆర్‌.. అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకుని.. స‌ద‌రు ప‌థ‌కాన్నిమ‌రింత బ‌లోపేతం చేసుకుని.. వైఎస్ ఫొటో ప‌క్కన‌.. త‌న ఫొటోను కూడా వేసుకుని.. ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించారు.

ఇది రాజ‌కీయ వ్యూహం. ఇక‌, తమిళ‌నాడు విష‌యానికి వ‌స్తే.. అమ్మ క్యాంటీన్లు.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా చేరిపోయాయి. ఈటికి.. పేద‌లు.. విద్యార్థులు కార్మికులు క‌నెక్ట్ అయిపోయారు. ఇలాంటి ప‌థ‌కాన్ని తీసేయాల‌ని అనుకుంటే.. కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన స్టాలిన్ తీసేయొచ్చు. లేదా.. క‌రుణ క్యాంటీన్ అని పేరు కూడా మార్చుకోవ‌చ్చు . కానీ, ఆయ‌న అలా చేయ‌లేదు. ఎందుకంటే.. ప్ర‌జ‌ల్లో ఒక‌సారి సెంటిమెంటుగా బ‌ల‌మైన ముద్ర వేసుకున్న‌.. ఒక ప‌థ‌కాన్ని మార్చి,.. లేదా పేర్లు మార్చి చేయ‌డం వ‌ల్ల‌.. ప్ర‌యోజ‌నం లేక‌పోగా.. న‌ష్ట‌మే వ‌స్తుంది.. ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాలు అందించిన‌ట్టు అవుతుంది.

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన‌.. ఇద్దరు ముఖ్య‌మంత్రులు ఇష్టం ఉన్నా.. లేకున్నా.. వాటినికొన‌సాగిస్తూ.. దానివ‌ల్ల‌.. మైలేజీని సొంతం చేసుకుంటున్నారు. కానీ… ఏపీలోకి వ‌చ్చేస రికి.. చిన్న చిన్న విష‌యాల్లో జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న పెద్ద పెద్ద పొర‌పాట్లు.. పార్టీకి.. ప్ర‌భుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకువ స్తున్నాయ‌ని.. సొంత పార్టీనాయ‌కులే అంటున్నారు.

అన్న క్యాంటీన్ల‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డం.. ద్వారా.. కొంత వ‌ర‌కు క్రెడిట్‌ను సొంతం చేసుకునే అవ‌కాశం ఉన్నా..జ‌గ‌న్ వాటిని మూసేయించారు. ఇక‌, తాజాగా ఎన్టీఆర్ పేరు తీసేసి.. హెల్త్ యూనివ‌ర్సిటీకి వైఎస్ పేరు పెట్టారు. అదేస‌మ‌యంలో.. ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. ఇలా చేయ‌డం వ‌ల్ల కొత్త‌గా వ‌చ్చే మైలేజీ లేక‌పోగా.. తీవ్ర‌మైన న‌ష్టం మాత్రం వ‌స్తుంద‌ని.. పార్టీ నాయ‌కులే అభిప్రాయ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Share post:

Latest