డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విశ్వ నటుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన `విక్రమ్` సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. స్టార్ హీరో కమలహాసన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో మరోసారి తన నటనతో అదరగొట్టాడు. అంతేకాకుండా ఈ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, స్టార్ హీరో సూర్య కూడా నటించారు.
విక్రమ్ ఏకంగా రు. 400 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుంది. అయితే తెలుగులో కూడా భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా రీసెంట్ గానే వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ లోకి వచ్చింది. అయితే విక్రమ్‌కు ఫస్ట్ ప్రీమియర్‌గా కాస్త తక్కువ టిఆర్పి వచ్చిందని చెప్పాలి. విక్రమ్ సినిమా ఫస్ట్ టైం కేవలం 5.1 టీఆర్పి రేటింగ్ మాత్రమే నమోదు చేసింది. అయితే డబ్బింగ్ సినిమాల పరంగా చూస్తే ఇది డీసెంట్ అంటున్నారు.