ఆ హీరోయిన్ చనిపోవడం..స్నేహ కు ప్లస్ అయ్యిందా..?

అందాల నటి స్నేహ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హోమ్లీ బ్యూటీగా తనదైన స్టైల్ నటిస్తూ ..సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్రను తనపై వేసుకుంది .డబ్బులిస్తే చాలు ఒంటి మీద బట్టలు కూడా లేకుండా నటించడానికి సిద్ధపడుతూ నటిస్తున్నటువంటి హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో.. కోట్లు ఇచ్చిన సరే ఇష్టం లేని పాత్రలో నటించను అంటూ ముఖం మీద చెప్పే సత్తా ఉన్న నటి స్నేహ.

స్నేహ ..తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ తనదైన స్టైల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . అంతేకాదు మరీ ముఖ్యంగా స్నేహా అనగానే అందరికీ టక్కున గుర్తువచేది.. ఆ చీరకట్టు ,ఆ బొట్టు , తల్లో పూలు ..చేతిలో గాజులు ఇలాంటి రోల్సే గుర్తు వస్తాయి తప్పిస్తే.. చడ్డీలు మిడ్డీలు వేసుకొని తైతక్కలాడే డ్యాన్సులు స్నేహా ని చూస్తే గుర్తు రావు . పద్ధతికి మరో మారుపేరు స్నేహ అనేలా తన పేరును మార్చుకుంది ఈ బ్యూటీ .

అయితే గతంలో స్నేహ పాల్గొన్న ఓ ఇంటర్వ్యుల్లో ..యాంకర్ ప్రశ్నిస్తూ..”సౌందర్య చనిపోతేనే మీకు పాపులారిటీ దక్కిందని వార్త వైరల్ గా మారింది. దానిపై మీరు ఏమంటారు” అని ప్రశ్నించగా ..”స్నేహ అలాంటిది ఏమీ లేదు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ని ఏ హీరోయిన్ తొక్కేయలేదు. ఎవరికి తగ్గ రోల్స్ వాళ్లకు వస్తూనే ఉంటాయి… హీరోయిన్స్ మధ్య ఈగోలు కుళ్ళు కోవడాలు ఇలాంటివి ఏవి ఉండవు.. సౌందర్య చనిపోవడం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది .. ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోయింది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సౌందర్య చనిపోవడం వల్లే స్నేహ కెరియర్ పికప్ అయిందన్న వార్తలకు ఆమె చెక్ పెట్టిన్నట్లైంది.

Share post:

Latest