హమ్మయ్య.. ఆ ప్రాబ్లం తీరిన్నట్లేగా..ఇక ఆల్ హ్యాపీస్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ న్యూస్ నిజమో ఏ న్యూస్ అబద్ధమో చెప్పలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ గానే మారుతూ ఉంటుంది. పోనీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ అబద్దమా అనుకుంటే అస్సలు కాదు ఎన్నో విషయాలను స్టార్ సెలబ్రెటీస్ అఫీషియల్ గా ప్రకటించక ముందే సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతులు తెలిసిందే .వాటిల్లో మరీ ముఖ్యమైనది నాగచైతన్య సమంత విడాకుల మ్యాటర్.

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వాళ్లు విడాకులు ప్రకటించే దాదాపు మూడు నెలల ముందు నుంచే సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి .సమంత నాగచైతన్య మధ్య యవ్వారం చెడిందని.. సమంత నాగచైతన్యకు దూరంగా ఉందని ,,త్వరలోనే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక వాటిని నిజం చేస్తూ సమంత నాగచైతన్య విడాకులు ప్రకటించారు.

కాగా ఈ మధ్యకాలంలో సమంత హెల్త్ గురించి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకరు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అని.. ఆ తర్వాత ఆమె గర్భసంచి తీయించేసుకుంది అని ..ఆ తర్వాత ఆమెకు స్కిన్ ప్రాబ్లం ఉన్నాయని ..ఇక ఆ తర్వాత ఏకంగా ఆమె ఆరోగ్యం బాగోలేని కారణంగా హుటాహుటిన అమెరికా వెళ్ళిందని ..ఇలా రకరకాలుగా వార్తలు అయ్యాయి. దీన్నంతటికీ కారణం సమంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడమే .

అయితే రీసెంట్ గా వీటన్నింటి పై ఆమె మేనేజర్ ఓ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ” సమంత హెల్త్ బాగుందని.. ఆమె ఆరోగ్యంగా ఉందని ,,ఆమెకు ఏ స్కిన్ ప్రాబ్లం లేదని ..ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉందని.. త్వరలోనే మీ ముందుకు రాబోతుందని..” చెప్పుకొచ్చాడు. దీంతో సమంత అభిమానులంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు ఆయన అఫీషియల్ గా చెప్పిన 24 గంటల లోపే సమంత ప్రతిష్టాత్మకంగా నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. దీంతో సమంత అభిమానులు డబుల్ హ్యాపీ అయ్యారు.