మాధవ్ మ్యాటర్ లో జగన్ క్లారిటీ..!  

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు…అయితే ఈ వీడియో అనూహ్యంగా లీక్ అయ్యి..వైరల్ గా మారింది. ఇక దీనిపై మాధవ్ కూడా క్లారిటీ ఇచ్చారు..వీడియోలను మార్ఫింగ్ లు చేసి తనని అప్రతిష్ఠపాలు చేసే కుట్ర చేశారని, దీనికి సంబంధించి ఏ విచారణకైనా సిధ్దమని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఆ వీడియోపై జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరానని మీడియాకు  చెప్పారు. టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ  తనపై కుట్ర చేశారని, అదే క్రమంలో ఏబీఎన్ ఎం‌డి రాధాకృష్ణపై కూడా మాధవ్ ఫైర్ అయ్యారు. అయితే ఇదంతా మాధవ్ వర్షన్…కానీ దీనిపై టీడీపీ నుంచే కాదు…ఇతర పార్టీల నుంచి, న్యూట్రల్ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒక ఎంపీ అయి ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు.

ఇక దీనిపై సీఎం జగన్ కూడా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది..ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి..ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు…నిజాలు నిగ్గు తేల్చి…అది గాని మార్ఫింగ్ కాదని తేలితే…మాధవ్ పై చర్యలు ఉంటాయని చెప్పారు. ఇదే క్రమంలో మీడియాలో సైతం మాధవ్ పై సస్పెన్షన్ వేటు వేయడానికి జగన్ సిద్ధమయ్యారని కథనాలు వస్తున్నాయి.

ఇలాంటి అనైతిక కార్యక్రమాలను ఉపేక్షిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఎంపీపై సస్పెన్షన్‌ వేటు తప్పదనే అభిప్రాయానికి వైసీపీ వర్గాలు వచ్చాయని సమాచారం. అయితే ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది..ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా? అలాగే ఎంపీ పదవి నుంచి తొలగించడమా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి మాధవ్ విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.