చైతూతో తన సంసారం అలా ఉండేదంటోన్న సమంత!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తరువాత తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడింది లేదు. అయితే తాజాగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సామ్, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ నయా ఎపిసోడ్‌ను షురూ చేశాడు. ఇందులో తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సమంతలు గెస్టులుగా వచ్చారు.

అయితే ఈ క్రమంలో సమంత తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఈ టాక్ షోలో తన వ్యక్తిగత జీవితంపై సమంత పలు హాట్ కామెంట్స్ చేసింది. చైతూతో తన పెళ్లి తరువాత పరిస్థితులపై కూడా ఆమె మాట్లాడింది. చైతూని అంతకాలం ప్రేమించిన తాను, పెళ్లి తరువాత ఎందుకో చైతూతో ప్రేమగా ఉండలేకపోయానని.. తన సంసారంలో పలు విభేదాలు రావడమే కాకుండా, తామిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయని సామ్ పేర్కొంది.

అటు చైతూని తాను చాలా వరకు అర్థం చేసుకోవడానికే సమయం సరిపోయేదని, తన కెరీర్‌కు ఇది అడ్డంకిగా మారుతుండటంతో తాను కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని సామ్ తెలిపింది. మోత్తానికి పాత మొగుడితో తన సంసారాన్ని రచ్చకీడుస్తున్న సమంతపై అక్కినేని అభిమానులు ఫుల్లు గుస్సాతో ఉన్నారు. సామ్ ఎంతకైనా మంచిది, వారి కంటపడకుండా జాగ్రత్తగా ఉండని పలువురు ఆమెకు సూచిస్తున్నారు.