ఆ మెగా ఫ్యాన్స్ ఏమైపోయారబ్బా..?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ ఫేవరేట్ హీరో సినిమాలు రిలీజ్ అయ్యిన్నప్పుడు అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు..ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. ఇక అదే మెగాస్టార్ సినిమా అంటే.. బాక్స్ ఆఫిస్ షేక్ అయ్యేలా ..రచ్చ రచ్చ చేస్తారు. ఇద్దరు మెగా హీరోలు ..అందులోను తండ్రీ కొడుకులు..ఒకరు మెగాస్టార్ అయితే..మరోకరు మెగా పవర్ స్టార్..సినిమా రిలీజ్ అయితే ఎలా ఉండాలి..ధియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్ వేస్తే టాప్ లేచిపోవాలి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఆచార్య అందుకు టోటల్ రివర్స్ గా ఉంది.

కొరటాల డైరెక్షన్ లో చిరంజీవి, రామ్ చరణ్ జంటగా కలిసి నటించిన సినిమా..”ఆచార్య”. దాదాపు మూడేళ్లు ఊరించి ఊరించి..రీసెంట్ గా రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. కధలో బలం కాదు సినిమాలో కధే లేదంటూ జనాలు మండిపడుతున్నారు. మెగాస్టర్ తో సినిమా అంటే ఓ రేంజ్ లో ఊహించుకున్నామని..కానీ ఇలా డిజాస్టర్ చేసి పెట్టారు సినిమా ని అని మెగా అభిమానులు సైతం చాలా బాధ పడ్డారు. ఇక సినిమా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు పర్లేదు అనిపించినా..రెండో రోజు..మూడో రోజు దారుణంగా పడిపోయాయి.

దీంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా కి తన ఖాతాలో వేసుకున్నాడు చిరంజీవి. పైగా సినిమాకి 70-80 కోట్లు నష్టం వచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మెగా ఫ్యాన్స్ తలచుకుంటే సినిమాని..బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా..యావరేజ్ టాక్ అయిన రప్పించి ఉండేవారు. గతంలో చాలా సినిమాలకు ఇదే జరిగింది. కధ బాగోలేకపోయినా మెగా ఫ్యాన్స్ దగ్గరుండి కలెక్షన్స్ ముందుకు నడిపించారు. మరీ ఆ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఆచార్య సినిమా టైం కి ఎక్కడికి పోయారు అంటూ..మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగా అభిమానులే ఈ సినిమా ప‌ట్ల అంత‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌లేద‌న్న‌ది స్ప‌ష్టంగా అర్ధమౌతుంది. ప్రి రిలీజ్ హైప్ అంత‌గా క‌నిపించ‌క‌పోవ‌డం ఒక మైనస్ పాయింట్ అయితే.. అడ్వాన్స్ బుకింగ్స్ డ‌ల్లుగా ఉండ‌డం చూసే మెగా అభిమానుల నిరుత్సాహం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆచార్య సినిమాను మెగా అభిమానులు కూడా లైట్ గా తీస్తున్నారు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.