మరో బ్లాస్టింగ్ మల్టీ స్టారర్ ని సెట్ చేసిన అనిల్ రావిపూడి..ట్రిపుల్ ధమాకా..?

యస్.. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తుంటే ఈ వార్త నిజమే అనిపిస్తుంది. స్లో గా అయినా..క్లీయర్ గా అభిమానులు ఏం కోరుకుంటారో..ఎలా సినిమాను తెరకెక్కిస్తే ఆనందిస్తారో అలా తన సినిమాలను డైరెక్ట్ చేసుకుంటూపోతున్నారు అనిల్ రావిపూడి. ప్రతి సినిమాకి స్టైల్ ని మారుస్తూ.. జనాలను నవ్వించడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్న ఈయన ఇప్పటీ వరకు తీసిన అన్ని సినిమాలు మంచి విజయం సాధించి.. డైరెక్టర్ గా టాప్ లిస్ట్ లో తన పేరు ఉండేలా చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన సినిమాలు వస్తున్నాయి అంటే జనాలు ఖచ్చితంగా కామెడీ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ప్రజెంట్ అనిల్ రావిపూడి మెగా ప్రీన్స్ వరుణ్ తెజ్..విక్టరి వెంకటేష్ తో కలిసి F3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన F2 సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. F2 సినిమా ఎంతటీ ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. తమన్నా-మెహ్రీన్ అందాలతో రచ్చ రచ్చ చేశారు. ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే ఫన్నీ సీన్స్ ని బాగా తెరకెక్కించాదు అనిల్. ఇక F3 లో కూడా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా అంటూ హామీ ఇచ్చాడు అనిల్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం F3 కి సీక్వెల్ గా F4 కూడా రాబోతుందట. అదే విషయాని F3 సినిమా ఎండింగ్ లో చెపుతారట టీం. అయితే సినిమాలో ఇప్పటి వరకు మనం రెండు జంటలనే చూశాం.. కాగా, ఇప్పుడు F4 లో మూడో జంట కూడా యాడ్ అవుతున్నారట. వెంకటేష్ దూరపు బంధువుగా ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య ఎంట్రీ ఇస్తున్నారట. చైతన్య ఓ అమ్మాయిని లవ్ చేశానని..తనతో పెళ్లి జరిపించడానికి..వెంకీ హెల్ప్ తీసుకునేందుకు ఫారిన్ లో ఉన్న అబ్బాయి..ఇండియాకి వస్తాడట. ఇక అప్పుడు వరుణ్-వెంకీ..చైతన్య కి పెళ్లి వద్దు రా నాయన ..అదో టార్చర్ అంటూ సినిమాని ఫుల్ కామెడీ గా తీసుకెళ్తారని ఓ వార్త బయటకి వచ్చింది. అదే కనుక నిజమైతే ఈసారి అభిమానులకు ట్రిపుల్ ధమాకా పక్కా అంటున్నారు సినీ ప్రముఖులు. మరి చూడాలి..అనిల్ ఏం చేస్తాడో..