ప‌వ‌న్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారే…!

రాజ‌కీయాల్లో ఎవ‌రైనా.. త‌మ‌కు రాని అవ‌కాశం కోసం కూడా ఎదురు చూస్తారు. అవ‌కాశాలు క‌ల్పించుకుని ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతారు. గ‌తంలో అనేక పార్టీలు ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు.. అనేక‌తంటాలు ప‌డే పార్టీలు కూడా ఉన్నాయి. అయితే.. ఎవ‌రూ అందిపుచ్చుకోని ఓ అవ‌కాశాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క ళ్యా ణ్ అందిపుచ్చుకున్నారు. అంతేకాదు.. దీని ద్వారా ఆయ‌న‌కు ద‌ళితులు.. వారి ఓటు బ్యాంకు కూడా చేరువ అవుతుంద‌ని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఈ వ్యూహం నుంచి ప‌వ‌న్ ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు.

అదే.. ఉమ్మ‌డి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ద‌ళిత నాయ‌కుడు.. దామోద‌రం సంజీవ‌య్య‌. అంద‌రూ మ‌రిచి పోయిన సంజీవ‌య్య గురించి ప‌వ‌న్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. అంతేకాదు.. దామోద‌రం.. ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేసి.. ద‌ళితుల‌కు సేవ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రూ ఊహించ‌ని విధంఆ ప‌వ‌న్ కోటి రూ పాయ‌లు కూడా ఈ ట్ర‌స్టుకు కేటాయించారు. ఇక‌, తాను.. కూడా విరాళాలు సేక‌రించి.. ట్రస్టు ద్వారా సేవ‌లు చేస్తాన‌న్నారు. అయితే. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిని ప‌ట్టించుకోలేదు. అప్ప‌ట్లో ప్ర‌క‌టించి.. చేతులు దులిపేసుకు న్నారు.

వాస్త‌వానికి ప‌వ‌న్ క‌నుక‌.. దామోద‌రం సంజీవ‌య్య‌ను ప‌ట్టుకుని.. ఎంతో కొంత ఉద్య‌మ‌మో.. లేక‌.. ద‌ళితుల ను సంటితం చేసే క‌కార్య‌క్ర‌మం చేప‌ట్టి ఉంటే.. రాజ‌కీయంగా మంచి క‌ద‌లిక వ‌చ్చేది. కానీ, ప‌వ‌న్ వ‌దిలేశా రు. దీంతో ప‌వ‌న్ ఏ కార్య‌క్ర‌మాన్నీ.. మ‌న‌సు పెట్టిచేయ‌ర‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి ఈ విష‌యం చ‌ర్చ‌కు ఎందుకు వ‌చ్చిందంటే.. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం.. జిల్లాల‌ను విభ‌జించి కొత్త‌గా 13 జిల్లా ల‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ క్ర‌మంలో క‌ర్నూలు జిల్లాను విభ‌జించి.. నంద్యాల‌ను జిల్లాగా ఏర్పాటు చేస్తోం ది.

అయితే..దీనికి దామోద‌రం సంజీవ‌య్య పేరు పెట్టాల‌ని.. పొరుగు రాష్ట్రంలోని వీ. హ‌నుమంత‌రావు.. ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ వంటివారు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప‌వ‌న్ మాత్రం ఉలుకుప‌లుకు లేకుండా ఉన్నారు. మ‌రి.. దీనిని బ‌ట్టి..ప‌వ‌న్ ఒక అందివ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దిలేసుకున్నారా? అనే గుస‌గుస వినిపిస్తోంది.