డీప్ లిప్ లాక్..ఘాటైన్ రొమాన్స్..ఆ హీరో కోసం గేట్లు ఎత్తేసిన ఈషా రెబ్బా..!!

ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో పాటలు లేకపోయినా పర్వాలేదు కానీ..రొమాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే జనాలు చూస్తున్నారో..లేక జనాలు చూస్తున్నారు కదా అని అలాంటి సీన్స్ పెడుతున్నారో తెలియదు కానీ..ప్రస్తుతం వస్తున్న అన్ని సినిమాల్లో రొమాంటిక్ సీన్స్,బెడ్ సీన్స్, ఎక్కువైపోయాయి. నిజం చెప్పాలంటే ఒకప్పుడు సినిమాలు ఇలా లేవు. రొమాంటిక్ సీన్స్ ఉండేవి. అవి చూడటానికి ఆహ్లాదకరంగా..చిలిపిగా ..భార్య భర్తల మధ్య సరసాలు లా ఉండేవి. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలో రొమాన్స్ చూడటానికి అసహ్యంగా..రోతగా ఉంటుంది. కొందరైతే సొంత భార్యని కూడా పక్కన పెట్టుకుని ఇలాంటి సీన్స్ చూడలేకపోతున్నం అంత దరిద్రంగా ఉంటున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా కొందరు డైరెక్టర్లు అలాంటి సీన్స్ తమ సినిమాలో కామన్ గా పెడుతున్నారు.

ఇక హీరోయిన్స్ కూడా అవకాశాలు లేక వచ్చిన అవకాశాలు వినియోగించుకునే మైండ్ సెట్ తో ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో ఒళ్లు తెలియకుండా నటించేస్తున్నారు. ఇప్పుడు ఇవే కామెంట్స్ వినిపిస్తున్నాయి మన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా మీద. చూడటానికి కొంచెం కలర్ తక్కువే అయినా..చీర కడితే మహా లక్ష్మి లా ఉంటుంది. నటన పరంగా కూడా తీసిపడేయాల్సినంత రేంజ్ కాదు. బాగా నటిస్తుంది. కానీ సరైన ఛాన్స్ లు రావడం లేదు. ఏవో రెండు మూడు సినిమాలు హిట్లు పడ్డా..అమ్మడు లక్ మాత్రం మారలేదు.

అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన్న ఈ బ్యూటీ..ప్రస్తుతం మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెటి తన లక్ ను అక్కడైన పరీక్షించుకుందాం అనుకుంటుంది. ఈ క్రమంలోనే మ‌ల‌యాళ స్టార్ హీరో కుంచుకో బోబ‌న్ స‌ర‌స‌న ఒట్టు సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇక వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ సినిమా నుండి ఓ రొమాంటిక్ పాటను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ పాటలో అమ్మడు రెచ్చిపోయి నటించిందనే చెప్పాలి . ఈ పాటను మీరు చూశాక ఇది మన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా నేనా అని అనుమానం రాక తప్పదు. ఇందులో ఏకంగా లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఈషా రెబ్బా. మరి ఇంత డీప్ రొమాంటిక్ సీన్స్ లో నటించిన ఈషాకి మలయాళ ఇండస్ట్రీలోనైన అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.