ప్యార్ మే పడిపోయానే..శ్రీముఖి హింట్ ఇచ్చేసిందిగా..!!

బుల్లితెర పై ఎంత మంది యాంకర్లు ఉన్నా..వాళ్లల్లో శ్రీముఖి స్ధానం,స్టైల్,రేంజ్, సౌండ్ చాలా స్పేషల్. అమ్మడు ఎక్కడ ఉంటే అక్కడ ఏదో తెలియని పవర్ వస్తుంది. ఒక మాట అంటే పడని శ్రీముఖి..తన జోలికి వస్తే ఇచ్చి పడేస్తుంది. లేడీ టైగర్ అనే చెప్పాలి. బుల్లి తెర పై తనదైన స్టైల్ లో యాంకరింగ్ లు చేస్తూనే మరో వైపు వెండి తెర పై సినిమాలు కూడా చేస్తుంది ఈ చిన్నది. అత్యాశ కు పోకుండా వచ్చిన రోల్స్ తో సరిపెట్టుకుంటూ..ఉన్నదాంతో సంతోషంగా ఉంది.

అమ్మడు పాపులారిటీ చూసి బిగ్ బాస్ వాళ్లు కూడా భారీ రేంజ్ లో ముట్టజెప్పి హౌస్లోకి పంపారు. ఇక బిగ్ బాస్ ద్వార శ్రీముఖి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిందనే చెప్పాలి. అమ్మాయి అయినా కూడా టాస్కుల్లో అబ్బాయిలతో పోటీ పడుతూ ఆడి..హౌస్ లో అల్లరి చేస్తూ ఆటపట్టిస్తూ అందరి తో సరదాగా ఉంటూ టాప్ 2 నిలిచింది. చాలా మంది శ్రీముఖినే విన్నర్ అవుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ ని చేసింది బిగ్ బాస్ టీం. ఇక బిగ్ బాస్ నుండి వచ్చాక ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి..తన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తూనే..ఫన్నీ వీడియోస్ తో..అందరిని ఆకట్టుకుంటుంది ఈ రాములమ్మ.

అయితే రీసెంట్ గా శ్రీముఖి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. వాలెంటైన్స్ డే సంధర్భంగా అమ్మడు పోస్ట్ చేస్తూ..ఇది నా లైఫ్ లో చాల స్పెషల్ వాలెంటైన్స్ డే..జీవితంలో ఎప్పుడు ఇలాంటి వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకోలేదు అన్నట్లుగా పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఈ రోజు ని గుర్తుపెట్టుకోండి. దీని గురించి మళ్లి మాట్లాడుకుందాం అంటూ తను తనకి ప్రపోజ్ చేసిన వ్యక్తి ప్రేమను యాక్సెప్ట్ చేశాను అని చెప్పకనే చెప్పేసింది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మారుమ్రోగిపోతుంది. పోస్ట్​లో ఉన్న లైన్స్​ను, ఫోటోను చూస్తే.. శ్రీముఖి ప్రేమలో పడినట్లు తెలిసిపోతుంది.. కానీ ఆ లక్కి బాయ్ ఎవరా అని ఆలోచిస్తున్నారు ఆమె అభిమానులు. మనం ఎంత ఆలోచించినా లాభం లేదు. ఈ విషయాని శ్రీముఖి కాని తనకు కాబోయే భర్త కానీ రివీల్ చేయాల్సిందే..!!