రాంగోపాల్ వర్మ దొంగతనం చేయడానికి గల కారణం ఇదేనా..?

రాంగోపాల్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో నాగార్జునతో కలిసి శివ సినిమా ద్వారా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత రక్త చరిత్ర లాంటి సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈయన రాజకీయవేత్తలను కూడా దృష్టిలో ఉంచుకొని సినిమాలను తెరకెక్కించడంలో గమనార్హం. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ తన దైన శైలిలో సినిమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. మరికొందరు ఈయన సినిమాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అన్ని అడాల్ట్ చిత్రాలనే తీస్తూ .. ఎంతో మంది అమ్మాయిలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

ఇకపోతే రాంగోపాల్ వర్మ ఇటీవల దొంగతనం చేశాడు అనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఆయన ఒక యూట్యూబ్ ప్రముఖ ఛానెల్ ద్వారా తెలపడంతో సంచలనంగా మారింది.. ఆ దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే.. ఆయన టీనేజ్లో ఉన్నప్పుడు ఖర్చులకు డబ్బులు లేక ఇంట్లో అడిగితే డబ్బులు ఇస్తే..కొడుకు చెడిపోతాడు అనే కారణంతో డబ్బులు ఇచ్చేవారు కాదట. రాంగోపాల్ వర్మ ఎవరు లేనిది చూసి ,తన తండ్రి జోబులో కానీ తన తల్లి దాచుకున్న డబ్బుల్ని కానీ చూడకుండా దొంగతనం చేసేవాడట..ఆయన స్వయంగా ఈ విషయాలను తెలపడంతో ఈ విషయం సంచలనంగా మారింది.