హీరో సుదీప్‌కే చెమ‌ట‌లు ప‌ట్టించిన ఫ్యాన్స్‌..అస‌లేమైందంటే?

కిచ్చా సుదీప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుదీప్‌ని అభిమానించే వారు ఎక్కువే. అయితే ఇప్పుడు ఆ అభిమానులు సుదీప్‌కి చెమ‌ట‌లు ప‌ట్టించేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సుదీప్ న‌టించిన `కోటిగొబ్బ 3` వాయిదా ప‌డుతూ ప‌డుతూ ఎట్ట‌కేల‌కు అక్టోబర్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

Sudeep's Kotigobba 3 Gets Release Date

తెల్ల‌వారుజామునే ఫ్యాన్స్ షోల కోసం ఏర్పాట్లు జ‌రిగాయి. కానీ వాటితో పాటు మార్నింగ్ షోలు కూడా ప‌డ‌లేదు. మ‌ధ్యాహ్నానికి కూడా థియేట‌ర్లు తెరుచుకోలేదు. ఇంకేముంది ఆగ్ర‌హించిన అభిమానులు క‌ర్ణాట‌క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేట‌ర్ల ఎదుట బీభ‌త్సం సృష్టించారు. చాలా చోట్ల థియేట‌ర్లపై రాళ్లేసి నానా హంగామా చేశారు.

Fans vandalise theatres over Kiccha Sudeep's Kotigobba-3 release delay

దాంతో వెంట‌నే రంగంలోకి దిగిన సుదీప్‌..అభిమానుల‌కు క్ష‌మాప‌ణ కోరుతూ..ప‌లు కార‌ణాల వ‌ల్ల కోటిగొబ్బ‌-3 గురువారం రిలీజ్ కావ‌ట్లేద‌ని తెలిపారు. శుక్ర‌వారం క‌చ్చితంగా సినిమా రిలీజ్ అవుతుంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కు అభిమానులు ఓపిగ్గా ఉండాల‌ని సూచించారు. అలాగే థియేటర్లను పాడు చేయవద్దని సుదీప్ అభిమానుల‌ను అభ్య‌ర్థించారు. కాగా, చిత్ర నిర్మాత మరియు ఫైనాన్షియర్ మధ్య గొడవ కారణంగానే కోటిగొబ్బ 3 విడుద‌ల ఆగిపోయిన‌ట్టు తెలుస్తోంది.

Share post:

Latest