శంక‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్ ఏ డైరెక్ట‌ర్‌తో చేయ‌నున్నాడో తెలుసా..?

October 15, 2021 at 8:47 am

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` పూర్తి చేసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మింస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా పూర్తి కాకుండానే.. చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టేశారు.

Ram Charan to team up with director Shankar for a historical drama? | Telugu Movie News - Times of India

ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. జెర్సీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను త‌న‌వైపుకు తిప్పుకున్న గౌతమ్ తిన్ననూరి. అందుతున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. గౌత‌మ్ ఇటీవ‌ల‌ ఓ అదిరిపోయే స్పోర్ట్స్ డ్రామా ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను చ‌ర‌ణ్‌కు వినిపించాడ‌ట‌.

Gowtam Tinnanuri not interested in Hindi remake of 'Jersey' anymore | Telugu Movie News - Times of India

అది బాగా న‌చ్చ‌డంతో చ‌ర‌ణ్ సినిమా చేసేందుకు వెంట‌నే ఓకే చెప్పాడ‌ని తెలుస్తోంది. ఇక వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌వి.ప్ర‌సాద్ పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించ‌నున్నార‌ని.. అలాగే త్వ‌ర‌లోనే ఈ సినిమాపై కీల‌క ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని టాక్‌.

 

శంక‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్ ఏ డైరెక్ట‌ర్‌తో చేయ‌నున్నాడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts