స్వాతిముత్యంగా బెల్లంకొండ గణేష్.. ఫస్ట్ లుక్ మామూలుగా లేదుగా?

కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ నటన గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం అదే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. బెల్లంకొండ గణేష్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమా లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. అయితే బెల్లంకొండ గణేష్ కి ఇదే మొదటి పరిచయం కావటం విశేషం. అంతేకాకుండా మొదటి సినిమాకి ఏకంగా పాపులర్ అయిన టైటిల్ పెట్టడం అనేది సాహసంతో కూడిన వ్యవహారమే. కాన్ఫిడెంట్ గా అంత పాపులర్ టైటిల్ పెట్టడంలో సినిమా కంటెంట్ అంతే స్ట్రాంగ్ గా ఉందని తెలియజేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు మహతి సాగర్ సంగీతం అందించగా,పి డి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Share post:

Latest