బన్నీ, బోయపాటి కలయిక లో రాబోతున్న రెండో సినిమా?

September 14, 2021 at 1:47 pm

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అలాగే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ కూడా కమిట్ అయ్యాడట. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందట. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. సినిమా అనంతరం స్టైలిష్ స్టార్ దిల్ రాజు నిర్మించే ఐకాన్ షూటింగ్ లో పాల్గొంటారు. ఇక దిల్ రాజు సినిమా కూడా పూర్తి అయిన తరువాత బోయపాటి షూటింగ్ ప్రారంభిస్తారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం బోయపాటి నందమూరి బాలకృష్ణతో కలిసి అఖండ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక కాగా శ్రీకాంత్ విలన్ నటిస్తున్నారు.

బన్నీ, బోయపాటి కలయిక లో రాబోతున్న రెండో సినిమా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts