పూజా హెగ్డే గొప్ప మ‌న‌సుకు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు!

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పూజా హెగ్డే.. మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బుట్ట‌బొమ్మ‌.. ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌, విజ‌య్ ద‌ళ‌ప‌తి స‌ర‌స‌న బీస్ట్ తో పాటు ప‌లు బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న పూజా త‌న‌లో ఉన్న మ‌రో కోణాన్ని అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. తాజాగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో `ఆల్‌ అబౌట్‌ లవ్‌` పేరుతో తాజాగా ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ఫౌండేషన్ ద్వారా పూజా సాయం చేయ‌నుంది.

ఈ సంద‌ర్భంగా.. సమాజం మనకు ఎంతో ఇచ్చినప్పుడు మనం కూడా తిరిగి ఇవ్వాలి అని చెప్పిన పూజా.. ప్రేమతో చేసే ఏ చిన్న సేవ అయినా ప్రపంచంలో మంచి మార్పుకి కారణమవుతుందని పేర్కొంది. దాంతో పూజా హెగ్డే గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. అంతేకాదు, ఆమె ఫౌండేష‌న్‌కు త‌మ వంతుగా సాయం అందించేందుకు ప‌లువురు నెటిజ‌న్లు కూడా ముందుకు వ‌స్తున్నారు.