రెండో పెళ్లికి సిద్ద‌మైన‌ సింగ‌ర్ నోయ‌ల్‌..అమ్మాయి ఎవ‌రంటే?

ప్రముఖ ర్యాపర్, సింగర్ నోయల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌లు సినిమాల్లోనూ న‌టించిన నోయ‌ల్‌.. బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి మంచి క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెయ్యి అబద్ధాలు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎస్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయల్.. గ‌త ఏడాదే ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ విష‌యాన్ని అటు ఎస్త‌ర్‌, ఇటు నోయ‌ల్ బ‌హిర్గ‌తంగానే అంద‌రికీ తెలియ‌జేశారు. అయితే ఇప్పుడు నోయ‌ల్ రెండో పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు, నోయల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. అత‌డి స‌న్నిహితురాలే అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే నోయ‌ల్ పెళ్లి వార్త‌లు ఇప్ప‌టికిప్పుడు ఊపందుకోవ‌డానికి కార‌ణం లేక‌పోలేదు.

తాజాగా నోయ‌ల్‌..ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. ఆగలేకపోతోన్నా అంటూ ట్వీట్‌ చేశాడు నోయల్‌. దీంతో ఇది పక్కా పెళ్లి విషయమే అని నెటిజన్లు మ‌రియు అభిమానులు భావిస్తున్నారు. మ‌రి నిజంగా పెళ్లి విష‌య‌మా..?
లేదా మ‌రేదైనానా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.