చెల్లెలు ద‌ర్శ‌క‌త్వంలో శ్రుతిహాసన్.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది.

ఇక మ‌రికొన్ని ప్రాజెక్ట్స్‌ను కూడా అంగీక‌రించిన శ్రుతిహాస‌న్‌.. త్వ‌ర‌లోనే త‌న చెల్లెలు అక్షర హాసన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతోంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రుతినే తెలిపింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు పెట్టింది.

ఈ క్ర‌మంలోనే తన చెల్లెలు అక్షర హాసన్ కు దర్శకత్వం రంగంలో రాణించాలనే కోరిక ఉందని.. ప్ర‌స్తుతం ఆ వైపుగానే అడుగు వేస్తుంద‌ని తెలిపింది. ఆమె దర్శకత్వం వహిస్తే తనకు సరిపడా కథ అందిస్తే.. తప్పకుండా నటిస్తానని తెలిపింది శృతి. మ‌రి చెల్లెలి ద‌ర్శ‌క‌త్వంలో శ్రుతిహాస‌న్ సినిమా ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే ఉంటుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.