కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2004లో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. రెండు తరాల హీరోలతో ఆడిపాడిన కాజల్.. ఇంకా తన హవాను కొనసాగించాలని చూస్తోందట.
ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ తగ్గించుకుని.. ప్రొడ్యూసర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఇటీవలె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిని కాజల్.. మళ్లీ ఆన్‌స్క్రీన్‌పై బిజీ కావాలని తెగ ప్రయత్నిస్తుందట. ఇందులో భాగంగా రెమ్మూనరేషన్‌ను తగ్గించుకుని మరీ.. సినిమా ఛాన్స్‌లను కొట్టేసే ప్రయత్నం చేస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ఇక ప్రస్తుతం చిరంజీవి, నాగార్జున, కామల్ హాసన్ వంటి సీనియర్ హీరోల సరసన నటిస్తున్న కాజల్.. యంగ్ హీరోలతో కూడా నటించేందుకు ట్రై చేస్తోందట. అందుకోసం తన రెమ్యునరేషన్ తక్కువే అని ప్రొడ్యూసర్లకు హింట్ ఇస్తుందట. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ.. నెటిజన్లు మాత్రం కాజల్ కన్నింగ్ ప్లాన్స్‌కు షాక్ అవుతున్నట్టు మీమ్స్ తయారు చేసి వైరల్ చేస్తున్నారు.