వాడుకుని వ‌దిలేశాడు..మాజీ మంత్రిపై న‌టి ఫిర్యాదు!

May 29, 2021 at 9:01 am

సినీ తార‌ల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు సంబంధాలు ఉండ‌టం, పెళ్లిళ్లు చేసుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. కానీ, తాజాగా మాజీ మంత్రి మోసం చేశాడు.. వాడుకుని వ‌దిలేశాడు అంటూ ఓ సినీ న‌టి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర ధుమారం రేపుతున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

త‌మిళ‌నాడుకి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మ‌ణికంద‌న్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వ‌ర్ధ‌మాన న‌టి చాందిని చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మ‌ణికంద‌న్‌కు, త‌న‌కు ఐదేళ్ల ప‌రిచ‌యం ఉంద‌ని, స‌న్నిహితంగా మెలిగామ‌ని, అప్ప‌ట్లో పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి వాడుకున్నాడ‌ని.. కానీ, ఇప్పుడు అత‌డు పెళ్లికి నిరాక‌రిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో చాందిని పేర్కొంది.

అంతేకాదు, మ‌ణికంద‌న్‌తో స‌న్నిహితంగా దిగిన ఫొటోల‌ను కూడా చాందిని బ‌య‌ట‌పెట్టి.. న్యాయం చేయాలంటూ కోరింది. మ‌రోవైపు మణికందన్ స్పందిస్తూ.. చాందిని త‌న‌పై బుర‌ద జ‌ల్లే ఆరోప‌ణ‌లు చేస్తుంది.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాన‌ని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యం త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వాడుకుని వ‌దిలేశాడు..మాజీ మంత్రిపై న‌టి ఫిర్యాదు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts