ఖిలాడి నుండి సర్ప్రైజ్ ఎప్పుడంటే..!?

మాస్ మహారాజ రవితేజ ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా ఖిలాడి అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి జత కట్టబోతున్నారు. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్నారు.రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాను హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి అందరికి విదితమే..

ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అన‌సూయ‌, అర్జున్‌తో పాటు మ‌ల‌యాళ హీరో ముకుంద‌న్ ముఖ్య పాత్ర‌లో కనపడబోతున్నారు. ఈ సినిమా దేశవాప్తంగా మే 28న పేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్‌ 12న ఉదయం 10:08 నిమిషాలకు ఖిలాడి సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలియచేసింది. ఇక మరో వైపు ఖిలాడి టీజ‌ర్ పై రవితేజ అభిమానులు భారీగా అంచ‌నాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం రవితేజ క్రాక్ సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే.

Share post:

Latest