హిమాలయాలకు వెళ్లిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎందుకంటే ..!?

బుల్లితెర పై యాంకర్‌ గా కెరీర్‌ను మొదలు పెట్టి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్బో సంపాదించుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీ తోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ లిస్ట్ వరకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పై తాను కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది ఆరియానా.

సిని సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూలు చేసేందుకు యూట్యూబ్‌లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి, ఎంతో మంది ప్రముఖులతో సందడి చేసింది ఆరియానా గ్లోరీ. అలానే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమె లైఫ్ ని మార్చేసింది. తన గురించి ఏకంగా ఆర్జీవీనే ట్వీట్ చేయడంతో ఫుల్ పాపులర్ అయిపోయింది అరియనా. తాజాగా ఆరియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియో పెట్టింది. నేను రెండు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే ట్యాగ్ చేస్తున్నారు. నేను 12 తేదీ వరకూ కనిపించను. హిమాలయాల్లో ట్రెకింగ్‌కు వెళ్తున్నా, నేను ఒంటరిగానే ప్రయాణిస్తున్నా అంటూ ఇంస్టా ద్వారా తెలిపింది.

Share post:

Latest