రికార్డ్స్ సృష్టిస్తున్న లారెన్స్ ప్లాప్ సినిమా..!?

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంచన మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందోఅందరికి తెలుసు. దీనితో కాంచన సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో లక్ష్మి గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి కూడా రాఘవ లారెన్స్ నే డైరెక్ట్ చేశాడు.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ మూవీ.

కానీ ఇండియన్ ఓటీటీ సినిమాల్లోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న చిత్రంగా లక్ష్మి రికార్డు నెలకొల్పడం పెద్ద విశేషం.తాజాగా ఈ చిత్రాన్ని టీవీల్లో ప్రీమియర్ వేయగా, ఏకంగా 2.5 కోట్ల ఇంప్రెషన్స్ వచ్చాయట. ఇండియన్ శాటిలైట్ చరిత్రలో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్నచిత్రంగా లక్ష్మి రికార్డు సృష్టించింది. సో ఈ విదంగా అయినా లారెన్స్ కి ఈ సినిమాతో మంచి రికార్డు పొందాడు అని చెప్పచు.