ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న చిరంజీవి క‌ల..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

ఎట్ట‌కేల‌కు చిరంజీవి క‌ల నెర‌వేర‌బోతుంద‌ట‌. అది కూడా కొడుకు రామ్ చ‌ర‌ణ్ ద్వారాన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌`, `ఆచార్య‌` సినిమాలు చేస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. త్వ‌ర‌లోనే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు.

సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇదిలా ఉంటే.. రోబో చిత్రీకరణ సమయంలో చిరంజీవి బహిరంగంగానే శంకర్ తో పని చేసేందుకు ఎప్ప‌టినుంచో వేచి చూస్తున్నానని మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు. కానీ అది ఇప్ప‌టి వ‌ర‌కు సాధ్యపడలేదు.

అయితే ఇప్పుడు చ‌ర‌ణ్‌తో శంక‌ర్ తీయ‌బోయే చిత్రంలో చిరంజీవి ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నారు. చిరు, చ‌ర‌న్ కాంబోకు మంచి బ‌జ్ ఉంది. అందుకే చిరుకు చ‌ర‌ణ్ సినిమాలో శంక‌ర్ ఓ మంచి క్యారెక్ట‌ర్ రాశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మేతే.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాలి అన్న చిరు క‌ల నెర‌వేరుతుంది.‌‌