ఎమ్మెల్యే సీటే మోజంటోన్న టీఆర్ఎస్ ఎంపీలు..!

ఓ ఎమ్మెల్యే, ఎంపీ మ‌ధ్య తేడా చూస్తే ఎమ్మెల్యే స్టేట్‌కు ప‌రిమిత‌మైతే ఎంపీ జాతీయ స్థాయిలో ఉంటాడు. ఎమ్మెల్యేల ప్రాబ‌ల్యం స్టేట్‌లో మాత్ర‌మే ఉంటే ఎంపీ ఢిల్లీ స్థాయిలో కూడా ప‌నులు చ‌క్క‌బెట్టే సామ‌ర్థ్యం క‌లిగి ఉంటాడు. అదే స్టేట్‌లెవ‌ల్లో ఎమ్మెల్యే మంత్రి అయితే ఆ స్టేట్‌లో తిరుగులేని లీడ‌ర్‌గా ఎదిగే స్కోప్ కూడా ఉంటుంది. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎంపీలంద‌రూ ఎమ్మెల్యే ప‌ద‌వి మీదే ఆస‌క్తి చూపుతున్నారట‌. వారి దృష్టిలో ఎంపీ ప‌ద‌వి కంటే ఎమ్మెల్యే ప‌ద‌వికే క్రేజ్ ఉంద‌ట‌.

తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లో కూడా అధికార టీఆర్ఎస్‌దే గెలుపు అన్న ధీమా అక్క‌డ అధికార పార్టీ నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఎంపీగా పోటీ చేసి గెలిచినా కొత్త‌గా వ‌చ్చే ప‌ద‌వేమి లేద‌ని డిసైడ్ అయిన కొంద‌రు టీఆర్ఎస్ ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి ప‌ద‌వి పొందాల‌ని ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

ఈ లిస్ట్‌లో ఒక‌రిద్ద‌రు కాదు ఏకంగా న‌లుగురు ఎంపీల ఆశ‌లు ఎమ్మెల్యే, మంత్రి ప‌ద‌వి మీదే ఉన్నాయ‌ని టీఆర్ఎస్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో కేసీఆర్ కుమార్తె ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఎలాగైనా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌న్న కోరిక‌తో ఉన్న క‌విత వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు. జ‌గిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి స్టేట్ కేబినెట్‌లో మంత్రి అయ్యేందుకు ఆమె ప‌క్కా ప్లానింగ్‌తో జ‌గిత్యాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక న‌ల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయ‌న ఎప్ప‌టి నుంచో ప్లానింగ్‌తో ఉన్నారు. ఇక ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేక‌పోయినా స్టేట్ పాలిటిక్స్‌లో రాణించేందుకు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఎమ్మెల్యేగానే పోటీ చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.

పెద్ద‌ప‌ల్లి ఎంపీ బాల్క సుమన్ సైతం త‌న ఎంపీ సీటును వ‌దిలేసి ఎమ్మెల్యేగా గెలిచి ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు త‌న ప్లానింగ్‌తో తాను ఉన్నార‌ని టాక్‌. మ‌రి వీరి ప్ర‌య‌త్నాల‌ను కేసీఆర్ ఎంత వ‌ర‌కు ఒప్పుకుంటారో ? చూడాలి.