నాగార్జున పొలిటిక‌ల్ ఎంట్రీ..!

అక్కినేని నాగార్జున. ప‌రిచ‌యం అక్క‌ర్లేని ఫేస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీలు, స్టార్ షోల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన ఈ చిన్నినాయ‌న‌.. ఇప్పుడు పొలిటిక‌ల్‌గా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు.. పొలిటిక‌ల్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. అదికూడా ఏపీలోని ఏకైక విప‌క్షం వైకాపాలోకి జ‌గ‌న్ చేరుతున్నార‌నే టాక్ బాగా వినిపిస్తోంది. వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కి అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో జ‌గ‌న్ ఆస్తుల కేసులో జైల్లో ఉన్న‌ప్పుడు స్వ‌యంగా వెళ్లిన నాగ్‌.. జ‌గ‌న్‌ని ప‌రామ‌ర్శించి వ‌చ్చారు.

అదేవిధంగా.. ఇప్ప‌డు అఖిల్ వివాహంతో జ‌గ‌న్‌తో మ‌రింతగా సంబంధాలు పెన‌వేసుకుంటున్నాయ‌ట‌. జీవీకే రెడ్డి మ‌న‌వ‌రాలిని నాగ్ చిన్న కుమారుడు సిసింద్రీ వివాహం చేసుకోనున్న నేప‌థ్యంలో కుటుంబాల ప‌రంగా కూడా జ‌గ‌న్‌తో రిలేష‌న్ పెరుగుతోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే నాగ్ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీని వైకాపా నుంచి ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రిణామం నాగార్జునకి ఎంత వ‌ర‌కు మేలు చేస్తుందే చెప్ప‌డం క‌ష్టం కానీ, జ‌గ‌న్ విష‌యంలో మాత్రం.. నాగ్ ఎంట్రీ ఎంతో లాభిస్తుంద‌నేది చ‌ర్చ‌గా మారింది.

ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లోను, కేసుల్లోను కూరుకుపోయిన జ‌గ‌న్‌కి నాగ్ లాంటి స్వ‌చ్ఛ‌మైన కేరెక్ట‌ర్ ఉన్న వ్య‌క్తి అవ‌స‌రం ఎంతో ఉంద‌ని ఆ పార్టీ నేత‌లే అంటున్నారు. ఇక‌, నాగ్ విష‌యానికి వ‌స్తే.. 2019లో రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి.. అసెంబ్లీ లేదా లోక్‌స‌భ‌లో కాలు పెట్టాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఇష్ట‌మైన జ‌గ‌న్ పార్టీలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే నాగ్‌.. జ‌గ‌న్ పార్టీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు!