అపోలో కిడ్నీ దందాలో వాళ్లూ ఉన్నారా?

కొన్ని రోజుల క్రితం దేశ రాజధానిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో ఢిల్లీలో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ అపోలో పేరు బయటకొచ్చింది. ఇక్కడే పలువురికి కిడ్నీ మార్పిడి జరిగినట్లు తేలింది. ఆపరేషన్లు చేసింది సీనియర్ డాక్టర్లే. అయితే వారికి అసలు విషయం చెప్పకుండా వాళ్ల అసిస్టెంట్లు పనికానిచ్చినట్లు పోలీసులు చెప్పారు. కానీ తాజాగా కిడ్నీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ వైద్యులను ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇంటరాగేషన్ లో రాజ్ కుమార్ రావ్ […]

ముద్రగడ సీబీఐని అందుకే వద్దొంటున్నారా?

కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలక మలుపు ఏమిటంటే ఆసుపత్రిలో బలవంతంగా తనను చేర్చినప్పటికీ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడానికి సిద్ధపడటంలేదు. బలవంతంగా వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలని చూస్తుండగా, వారిని ప్రతిఘటిస్తున్నారు ఆయన. ఇంకో వైపున తుని విధ్వంసంపై సిబిఐ విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. సిబిఐకి ఇచ్చేంత చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. అందుకనే ముద్రగడ అంగీకరించాలనే అడ్డుపుల్ల వేసింది. ముద్రగడ కూడా సిబిఐ విచారణకు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే […]

ఇది ఆంధ్ర కాదు అమిత్ జీ..లెక్క పక్క ఉండాలే!!

తెలంగాణను బీజేపీ ఆదుకోలేదని తెలంగాణ నుంచి పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని దోచుకుని, తమ మిత్రపక్షం కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. నల్లగొండ జిల్లాలో నిన్న బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించగా, ఆ సభకు హాజరైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, తెలంగాణకు 90 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ఇచ్చిందనీ అయినా తెలంగాణ […]

ఎట్టకేలకు నోరు విప్పిన చిరంజీవి..

ముద్రగడ పద్మనాభం అరెస్టు ఖండిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తుని ఘటనను సీబీఐ విచారణ చేపట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. దాంతో పాటు తుని ఘటనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. ముద్ర‌గ‌డ దీక్ష‌కు దిగిన సంద‌ర్భంగా పోలీసులు ఆయ‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుపై చిరంజీవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం ముద్ర‌గ‌డ‌పై వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు క‌క్ష సాధింపు చ‌ర్య‌లా ఉంద‌ని […]

సెల్ఫ్ డిఫెన్స్ లో ఏపీ సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును ఒక్కసారిగా సమస్యలు కమ్ముకుంటున్నాయి. ఎదురవుతున్న అన్నీ సమస్యలనూ తానే చూసుకోవాల్సి రావటంతో సిఎం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కేంద్రంగా ఉభయగోదావరిలో ఉద్రిక్తత. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుసపెట్టి మాటల దాడులు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎంఎల్ఏలు ఆరోపణలు, విమర్శలు, ఇంకోవైపు హైదరాబాద్‌లోని సచివాలయం నుండి విజయవాడ ప్రాంతానికి తరలి రావటానికి ఇష్టపడని ఉద్యోగులు. ఇన్ని సమస్యల మద్య చంద్రబాబు ఉక్కిరి […]

చెప్పులు, చీపురు మైలేజ్ ఎంత!!

ఇటీవల రైతు భరోసాయాత్ర చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన మాటలవేడి పెంచి రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపారు. సిఎం చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని సిఎంను చెప్పులతో, రాళ్లతో కొట్టండి అని విమర్శలు గుప్పించారు. దీనిపై టిడిపి నేతలు ప్రతిదాడికి చేయగా ఇంకా ఒక అడుగు ముందుకేసిన జగన్మోహన్‌రెడ్డి చెప్పులు, రాళ్లతో కొడితే బాగోదటా అందుకే మీరు చీపురు చూపండి అని మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. […]

ఈసారి చంద్రబాబు దెబ్బ అదుర్స్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హైదరాబాద్‌ నుంచి ఉద్యోగుల్ని తరలించే అంశంపై తలెత్తుతున్న వివాదాన్ని భలేగా డీల్‌ చేశారు. పెర్‌ఫెక్ట్‌ టైమింగ్‌లో ‘స్థానికత’ అంశాన్ని ప్రయోగించారు. ఎప్పటినుంచో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న స్థానికత అంశంపై చంద్రబాబు క్లారిటీ తీసుకురాగలిగారు. జూన్‌ 2, 2017 నాటికి ఆంధ్రప్రదేశ్‌కి ఎవరైతే వెళతారో వారంతా అక్కడి స్థానికతను పొందుతారని చంద్రబాబు ఇదివరకే చెప్పారు. దానికి కేంద్రం ఆమోద ముద్ర వెయ్యవలసి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం ఇటీవల ఆ […]

కొత్త జిల్లాలు – ఇవి చాలా కాస్ట్లీ గురూ

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంవల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2వేల కోట్ల వరకు భారం పడనున్నట్టు ప్రాథమిక అంచనాలో తేలినట్టు తెలిసింది.ఎందుకా అంత అనుకుంటున్నారా! ఏర్పాటు కాబోయే 14-15 కోత్హ జిల్లాలకు భవనాల నిర్మాణానికే జిల్లాకు రూ. 100 కోట్ల. ఈ లెక్క ప్రకారమే దాదాపురూ. 14 నుంచి 15 వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీనికి తోడు భవనాల నిర్మాణం కోసం ఖర్చు చేసే నిధులతోపాటు వాహనాలు, ఫర్నిచర్, సామగ్రి, భవనాల […]

విషపు దీక్షలు-వింత చేష్టలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ఓసారి తన ఇంట్లో నిరామార దీక్ష చేశారు ఈ మధ్యకాలంలో. అయితే ఆ దీక్ష ఫలించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ దక్కకుండానే దీక్ష విరమించారు ముద్రగడ అప్పట్లో. మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వ తీరుకు నిరసనగా ముద్రగడ పద్మనాభం, తన భార్యతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే పోలీసులు ఆయన్ని వివిధ కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా, అందుకాయన అనుమతించడంలేదు. ఇంట్లోకి వెళ్ళి గడియ […]