టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు.. తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలాఈఈజ్ కానున్న ఈ సినిమా విజువల్స్ ఇప్పటికే ఆడియన్స్ లో హైప్‌ను పెంచేశాయి. మారుతి లాంటి డైరెక్టర్‌తో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఈరోజు భారీ స్కేల్లో సినిమా రూపొందుతుండటంతో మొదట్లో రిజల్ట్ పై అందరికీ కాస్త తేడా అనిపించినా.. ఇప్పుడు మాత్రం సినిమాపై మంచి హైప్ మొదలైంది. మారుతి హారర్ కథాంశాన్ని అద్భుతమైన హ్యూమర్‌తో రక్తి కట్టించారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మునుపటి కంటే మంచి చార్మింగ్ లుక్‌తో మెరుస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ మొదలైంది.
అయితే.. నార్త్ బెల్ట్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉందనే టాక్. తెలుగు రాష్ట్రాలపై సినిమా ప్రమోషన్స్ లో కాన్సన్ట్రేషన్ చేసిన విధంగా.. హిందీ బెల్ట్ లో కానీ.. ఉత్తరాదిలో కానీ.. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అటు ప్రభాస్ కానీ.. ఇటు రాజాసాబ్ టీం కానీ.. ఫోకస్ చేయలేదు. సంజయ్ దత్, జరీనా వహబ్ లాంటి సీనియర్ బాలీవుడ్ స్టార్లు సినిమాలో నటించినా.. ప్రమోషన్స్‌లో మాత్రం వాళ్లు కనిపించట్లేదు. ఇక సినిమా రిలీజ్ కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉండడం.. ఈ టైంలోనే నార్త్ ప్రమోషన్స్ చేయాల్సి ఉన్నా.. ఎందుకు టీం సైలెంట్ గా ఉన్నారు అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నార్త్‌లో సాధారణంగానే ప్రభాస్ సినిమాలంటే భారీ హైప్ మొదలైపోతుంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా మంచి ఓపెనింగ్స్ తో రికార్డు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అలా గతంలో తెరకెక్కిన సాహో సినిమా తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అందుకోకపోయినా.. ఉత్తరాదిలో మాత్రం బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక్కడ రాదేశ్యాం ఫ్లాప్‌గా నిలిచినా.. అక్కడ మాత్రం మంచి కలెక్షన్లు దక్కించుకుంది. అలాంటిది నార్త్ ఆడియన్స్‌కు ఎంత ఇష్టమైనా.. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో ప్రభాస్ కనిపిస్తున్నాడు. అలాంటి ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎందుకు సరిగా ప్రమోట్ చేయడం లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమాలో విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయని.. అలాంటి సినిమాకు సరైన ప్రమోషన్స్ ఉంటే.. కచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు. ఇక.. ఇప్పటికైనా రాజాసాబ్ టీం.. ప్రభాస్, సంజయ్ దత్, జరీనా వహబ్ తో కలిసి నార్త్ లో ప్రమోషన్స్ మొదలెడితే రిలీజ్ టైం కి మంచి రిజల్ట్ ఉంటుంది.. నార్త్ బెల్ట్ లో మంచి ఓపెనింగులను సాధించడానికి టీం పని చేస్తే మంచిదని.. లేకపోతే అనవసరంగా రాజాసాబ్ మంచి అవకాశాన్ని కోల్పోతుందంటూ విశ్లేషిస్తున్నారు.

