డైనమిక్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా “కన్నప్ప” . అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది . అఫ్కోర్స్ సినిమాపై అడపా దడపా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ని బాగుంది అంటూ మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మోహన్ లాల్ పాత్ర చాలా సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేశాడు విష్ణు అని .. మలయాళీ అభిమానులకు ఈ పాత్ర బాగా నచ్చేస్తుంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు .
ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడిగా వర్క్ చేశారు. ఈ సినిమాలో పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటి సంపాదించుకున్న స్టార్స్ మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ , అందాల ముద్దుగుమ్మ కాజల్ ముఖ్య పాత్రలు పోషించి నటించి మెప్పించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రీమియర్స్ ను మంచి టాక్ అందుకుంది. కన్నప్ప సినిమాలో హీరో మంచు విష్ణు కానీ మంచి విష్ణు కన్నా కూడా ఎక్కువగా జనాలు గెస్ట్ రోల్ నటించిన ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. ప్రభాస్ నటన పర్ఫామెన్స్ గురించి వేరే లెవెల్ లో పొగిడేస్తున్నారు. ఇక ఆ తరువాత ఈ సినిమాలో తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడి క్యారక్టర్ లో గంభీరమైన వాయిస్ తో మెప్పించాడు.
అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో ఈ సినిమా ను మరో మెట్టు ఎక్కించాడు. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మహాదేవ శాస్త్రిగా నటించలేదు జీవించేసాడు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ల పాత్రలకి తగిన న్యాయం చేశారు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. కన్నప్ప సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు జనాలు. కొంతమంది ఫస్ట్ ఆఫ్ బోరింగ్ గా ఉంది అని.. సెకండ్ ఆఫ్ ప్రభాస్ వచ్చాక వేరే లెవెల్ కి సినిమా వెళ్ళిపోతుంది అని చెప్పుకొస్తున్నారు.
అంతేకాదు క్లైమాక్స్ చాలా చాలా అద్భుతంగా ఉందని .. ప్రతి ఒక్క అభిమానిని ఎమోషనల్ కి గురి చేసే విధంగా క్లైమాక్స్ కంటతడి పెట్టించే రేంజ్ లో ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు కనప్ప నిజంగా ఒక విజువల్ వండర్ అని కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కన్నప్ప సినిమా హిట్ అవ్వడానికి కర్త – కర్మ – క్రియ అంతా కూడా ప్రభాసే అని చెప్పుకోవడంలో సందేహమే లేదు అంటూ రెబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ప్రభాస్ ని పొగిడేస్తున్నారు. క్లైమాక్స్‌లో మంచు విష్ణు నటన సూపర్ .
ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది అంటే మాత్రం సెకండ్ హాఫ్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ ..మ్యూజిక్ .. పాటలు .. లిరిక్స్ .. వి ఎఫ్ ఎక్స్ అన్ని చాలా బాగున్నాయి . రైటింగ్ బాగానే ఉన్నా ఇంకొంచెం బాగా రాసుకుంటే ఇంకా బాగుండేది అంటూ రివ్యూ ఇస్తున్నారు . ఓవర్ ఆల్ కృష్ణంరాజు కన్నప్ప అంత కాదు కానీ ఓసారి మాత్రం చూడగలిగే సినిమా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ప్రభాస్ .. సినిమాకి అతి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ అంటూ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో…???!!!