ఐదుగురు వారసులు ఉన్నా ఆ హీరోని దత్తత తీసుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల‌లో ఒకరైన ఏఎన్ఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు తన సినీ కెరీర్‌లో 250 కి పైగా సినిమాలు నటించి మెప్పించిన ఏఎన్నార్.. ఇండస్ట్రీలోకి రాకముందు పలు నాటకాల్లో ఆడపిల్లలు వేషం వేస్తూ ఆకట్టుకునేవారు. అయితే ఆయన ఫ్రెండ్స్ నాగేశ్వరరావును విపరీతంగా ట్రోల్స్ చేసేవారట. ఆయినా నటనపై ఆసక్తితో వాటిని పట్టించుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఎన్నార్.. తాను ఎదగడమే కాదు.. వారసుల‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి అక్కినేని సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అయితే ఏఎన్ఆర్ కు అయిదుగురు వారసులు ఉన్న సంగతి తెలిసిందే.

Sumanth - Here's to my grandpa ANR (my father in spirit who raised me,  RIP), and my biological father Surendra. #FathersDay | Facebook

వెంకటేష్, నాగార్జున, నాగ సరోజ, నాగ సుశీల, సత్యవతి అయిదుగురు పిల్లలు ఉన్న ఏఎన్ఆర్.. వారిని కాకుండా మరో హీరోను దత్తత తీసుకున్నడట. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు అక్కినేని సుమంత్. ఏఎన్ఆర్ కూతురు సత్యవతి యార్లగడ్డ, సురేంద్రలకు పుట్టిన సుమంత్ అంటే.. ఏఎన్ఆర్ కు మొదటి నుంచి చాలా ఇష్టమట. ఆయనకు, సుమంత్‌కి మధ్యన మంచి కనెక్షన్ ఉండేదట. సుమంత్ పుట్టిన సమయంలో ఏఎన్ఆర్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో.. ఒక సంవత్సరం అంత సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి ఇంటి పట్టానే ఉండాల్సి వచ్చిందట ఏఎన్ఆర్.

Sumanth gets big property of ANR – varunrao60

ఆ సమయంలో సుమంత్ బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఏఎన్ఆర్ చుట్టూనే తిరిగేవారట. ఏఎన్ఆర్ ను హత్తుకుని ఉండేవాడ‌ట‌. అలా వారిద్దరి మధ్యన బాండింగ్ పెరిగిపోవడంతో.. సత్యవతి, సురేంద్రలు విదేశాలకు వెళుతున్న సమయంలో వీడు నాకు బాగా కనెక్ట్ అయ్యాడు. వీడిని ఇక్కడే ఉంచేసి విదేశాలకు పోండి అని అన్నారు అట ఏఎన్ఆర్‌. తండ్రి అడిగిన మాటను కాదని లేక.. ఏఎన్ఆర్‌కు సుమంత్ ను అప్పజెప్పేసి ఆయన తల్లిదండ్రులు విదేశాలకు వెళ్ళిపోయారు. తర్వాత వారి మధ్య ఉన్న బాండింగ్‌తోనే.. ఏఎన్నార్.. సుమంత్‌ని ద‌త్త‌త‌ తీసుకున్నారు.