చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా.. హీరో ఎవరంటే..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పటికే ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది అడుగుపెట్టినా వాళ్ళు యావరేజ్ హీరోలు గానే ఉన్నారు. అతి త‌క్క‌వ మంది మాత్రమే పాన్ిండియ‌న్‌ స్టార్ హీరోలుగా రాణిస్తూ దూసుకుపోతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం కేవలం నిహారికనే. కాగా.. నిహారిక ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేక పోయింది.

Chiranjeevi's daughter Sreeja heads for divorce?

ప్రజెంట్ ఇండ‌స్ట్రీలో ప‌లు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంది. ఇక నిహారిక కంటే ముందు చిరంజీవి చిన్న కూతురు శ్రీజను కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని సురేఖ భావించిందట. అలాగే అల్లు అరవింద్ కూడా ఆమెకు సహాయం చేశాడట. అలా ఓ బ్లాక్ బస్టర్ సినిమాల్లో శ్రీజను హీరోయిన్గా చేయాలని భావించారట. ఇంతకీ ఆ మూవీ ఏంటో చెప్పలేదు కదా.. అదే అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న గంగోత్రి. ఇక మొదట శ్రీజను కూడా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంటర్డ్యూస్‌ చేయాలని భావించారట సురేఖ, అల్లు అరవింద్‌.

Gangotri streaming: where to watch movie online?

కానీ.. చిరంజీవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కూతుళ్లు ఇండస్ట్రీలోకి నటులుగా అడుగు పెట్టకూడదని పట్టుపట్టాడట. బలంగా ఈ విషయంలో సురేఖను వ్యతిరేకించాడట. అలా అల్లు అరవింద్, సురేఖ.. గంగోత్రి సినిమాలో శ్రీజ హీరోయిన్గా నటింప‌జేసే ప్రయత్నాని విరమించుకున్నారు. ఇక శ్రీజకు కూడా హీరోయిన్ అవ్వాలని చిన్న ఆశ ఉన్నా.. చిరుకు ఇష్టం లేదనే ఉద్దేశంతో ఆ ఆశను వదిలేసిందట. అలా చిరంజీవికి శ్రీజ అన్నా.. శ్రీజకు చిరు అన్నా.. మొదటి నుంచి చాలా ఇష్టమట. కానీ గతంలో ఈమె తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఇప్పటికీ శ్రీజ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూనే ఉందన్న సంగతి తెలిసిందే.