రానా తన చూపుతోనే నన్ను భయపెట్టాడు.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది బాహుబలి మూవీనే. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్‌డంను సంపాదించుకుని దూసుకుపోతున్న రానా.. మంచి కంటెంట్.. పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తే హీరోగానే కాదు.. విలన్ పాత్రలోనైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా నటించేందుకు సిద్ధమవుతాడు. తన నటనతో వైవిద్య‌త చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాడు.

Rana Daggubati begins filming for Rajinikanth's Vettaiyan

ఈ క్రమంలోనే తాజాగా రానా రజినీకాంత్ హీరోగా తెర‌కెక్కిన వెట్ట‌యాన్ మూవీలోకి కీలక పాత్రలో కనిపించాడు. ఇక సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో రానా గురించి రజనీకాంత్ మాట్లాడుతూ ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. రానా.. రామానాయుడు మనవడిగా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అప్పట్లోనే సెట్స్ కి వచ్చేవాడు. ఫుల్ జాలీగా ఎంజాయ్ చేసేవాడు. కానీ.. ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్‌లుక్ తో భయపెట్టేస్తున్నాడు.

Superstar rajinikanth fiery speech at jailer audio launch key moments

అతను చూపుకు నేను నిజంగానే భయపడేవాడిని అంటూ రజనీకాంత్ వెల్లడించాడు. సూపర్ స్టార్ రేంజ్‌లో ఉన్న రజినీకాంత్.. రానాను ఈ రేంజ్‌లో ప్రశంసించారు అంటే ఇంతకంటే మించిన ఎలివేషన్ మరొకటి ఉండదు అనడంలో సందేహం లేదు. జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవెల్ డైరెక్షన్లో వెట్ట‌యాన్‌ మూవీ తెరకెక్కనుంది. అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ ఇలా భారీ తారాగడంతో సినిమా రూపొందింది. అనిరుధ్‌ ఇచ్చిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 10 తెలుగు, తమిళ్‌లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.