టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ సంపాదించుకున్న ఇద్దరు స్టార్ హీరోస్.. పాన్ ఇండియా లెవెల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఇటీవల తారక్.. దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కొరట్టాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతుంది. అయితే ఆర్‌ఆర్ఆర్ తర్వాత చేసిన సినిమాతో తారక్ హిట్ కొట్టాడు. ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది.
ఆర్‌ఆర్ఆర్ రిలీజ్ తర్వాత చరణ్ గెస్ట్ రోల్‌లో ఆచార్యలో నటించిన.. చరణ్ నటిస్తున్న సోలో సినిమా గేమ్ ఛేంజర్ కావడంతో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ను రామ్ చరణ్ బ్రేక్ చేస్తాడా.. లేదా.. అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరొపక్క పూర్తవుతున్నాయని.. కొద్ది రోజుల్లో సినిమా షూట్ కు గుమ్మడికాయ కొట్టనున్నట్లు టాక్. ఇక ఇప్పటికే సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ గా పలు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన రా మచ్చా.. సాంగ్‌తో ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ నెలకొంది.
ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా.. లేదా.. బాలీవుడ్ వసూళ్లు గేమ్ ఛేంజర్‌కు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ల రీత్యా దేవర.. బీటౌన్ వద్ద లాంగ్ రన్ లో రూ.60 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ అక్కడ ఎంత వసూలు చేస్తుందో అని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ప్రస్తుతం టాక్ ప్రకారం గేమ్ ఛేంజర్ బాలీవుడ్ టార్గెట్ రూ.60 కోట్లు అట. ఇక చరణ్ ఈ టార్గేట్‌ను బ్రేక్ చేస్తారో లేదో వేచి చూడాలి.