చరణ్ – బుచ్చిబాబు మూవీ బడ్జెట్ తెలిస్తే నోటి మాట రానే రాదు..!

మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన నటనతో ఎప్పటికప్పుడు సత్తా చాటుతున్న చరణ్.. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి ఇమేజ్ను సంపాదించుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా మంచి ఫామ్‌లో ఉన్న చరణ్ తన నెక్స్ట్ సినిమాలపై కూడా ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో చరణ్ మరో సినిమాలో నటించనున్నాడు.

#RC16 -VIDEO | Ram Charan | Janhvi Kapoor | Buchi Babu Sana | AR Rahman  |Mythri Movie Makers - YouTube

ఈ సినిమాతో మరోసారి ప్రభంజనం సృష్టించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రూ.500 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో ఉప్పెన లాంటి చిన్న సినిమాతోనే బుచ్చిబాబు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడు అందరికీ తెలిసిందే. అలాంటి బుచ్చిబాబు ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్‌లో సినిమా అంటే ఆ రేంజ్ బడ్జెట్‌ను హ్యాండిల్ చేయగలడా అనే సందేహాలు కొందరిలో వ్యక్తమైన.. మరికొంతమంది మాత్రం బుచ్చిబాబు ఈ సినిమాను ఉప్పెనకు మించిన రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తాడంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బుచ్చిబాబు తన ఎంటైర్ కెరీర్‌లో రెండో సినిమాతోనే రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేయడం అనేది సాధారణ విషయం కాదు.

Global Star Ram Charan, Buchi Babu Sana Pan India Film #RC16 Grand opening  Tomorrow - idlebrain.com

బుచ్చిబాబుకి ఇప్పటివరకు సుకుమార్ హెల్ప్ చేసిన.. అతనిలో టాలెంట్ ఉంది కాబట్టే ఈ రేంజ్ లో సుకుమార్ ప్రోత్సహించాడు అనడంలో సందేహం లేదు. ఇక ఈ ప్రాజెక్టును సెట్ చేసింది కూడా సుకుమార్‌ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాతో బుచ్చిబాబు పెను ప్రభంజనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడట. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.. బుచ్చిబాబు కెరీర్‌ను ఎలా మారబోతుందో వేచి చూడాలి. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటే మాత్రం బుచ్చిబాబుతో సినిమా చేయడానికి పానీ ఇండియా లెవెల్ లో ఉన్న హీరోలు అంతా ఆసక్తి చూపుతారనడంలో సందేహం లేదు.