టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే అత్యధిక ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న పవర్ స్టార్.. తన సినిమాలతో పాటు.. రాజకీయాల్లోనూ రాణిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న పవన్ ముందు.. సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అంత దిగదుడుపే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అభిమానులను అల్లరించలేకపోయినా.. సమయం దొరికినప్పుడల్లా అడపాదడపా సినిమాల్లో అయినా నటించి.. ఆడియన్స్ మెప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాలను లైన్లో పెట్టిన పవర్ స్టార్.. ఓజీ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని.. తన తర్వాత సినిమాలు చేయడానికి సిద్ధమవుతాడట. ఇక ఓజీ సినిమాను మార్చిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం సుజిత్.. దెబ్బకు స్టార్ డైరెక్టర్‌గా మారిపోతాడు అనడంలో సందేహమే లేదు. సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్న సుజిత్.. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసే విధంగా ప్లాన్ సిద్ధం చేసుకున్నాడట. ఇప్పటికే సుజిత్ నానితో ఓ సినిమాకు కమిట్ అయ్యినా.. సినిమా సెట్స్ పైకి రాకముందే ఆగిపోయింది.
ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఓజీ పూర్తి చేసిన తర్వాత సుజిత్ ఏ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఇప్పుడు అందుతున్న వార్తల ప్రకారం పవన్ సినిమా సూపర్ సక్సెస్ అయితే.. సుజిత్ నెక్స్ట్ సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తో ఉండబోతుందని.. అయితే ఈ సినిమా సక్సెస్ పైనే జూనియర్ ఎన్టీఆర్‌తో సుజిత్ చేయబోయే సినిమా ఆధారపడి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఓజి విషయానికి వస్తే.. ఇప్పటికే ఉదయం నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా.. లేదా.. తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.