టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో తన సత్తా చాటుకున్న రవితేజ.. తను నటించిన మిరపకాయ సినిమాతో నిర్హాతలకు లాభాల వర్షం కురిపించింది. 2011లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాల్లో రవితేజ పోలీస్ ఆఫీసర్గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించడం విశేషం. ఇక ఈ సినిమాల్లో సాంగ్స్ మరింత హైలెట్గా నిలిచాయి. కాగా మూవీలో రవితేజ సరసన్న ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు రిచా గంగోపాధ్యాయ, రెండోది దీక్ష సేథ్. ఈ ఇద్దరు హీరోయిన్‌లు తమ అంద చందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే వీరిలో రిచా గంగోపాధ్యాయ బాగా పాపులారిటీ దక్కించుకుంది.
ఈ సినిమా తర్వాత అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇక రిచా.. మిరపకాయ సినిమా కంటే ముందే రానా దగ్గుపాటి డెబ్యూ మూవీ లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా కంటే ఎక్కువగా మిరపకాయ్ సినిమాతో పాపులారి టిదక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మిర్చి, నాగవల్లి, బాయ్, సార్ వచ్చారు ఎలా వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి లోఆమె అందం, అభినయం ప్రేక్షకులను మెప్పించాయి. తెలుగుతో పాటు తమిళ్, బెంగాలీ లోను పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది.
ఇక ఈ క్రమంలోనే అమెరికాలో జోలాంగ్లే అనే వ్యక్తిని ప్రేమించిన రీచా.. పెద్దల అనుమతితో అతనిని వివాహం చేసుకుంది. ఇక ఈ జంటకు ఓ బాబు కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రీకి దూరమైన తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా టచ్‌లో లేకపోవడంతో.. ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది.. అనే అంశాలపై ఆడియన్స్ తెగ సెర్చింగ్ మొదలు పెట్టేసారు. ఈ క్రమంలో రీచా తన పిల్లాడితో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్స్.. వామ్మో తను రీచాన.. ఏంటి అంతలా మారిపోయింది.. అసలు మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం అంటూ.. అప్పటికి ఇప్పటికీ ఇంత చేంజ్ ఎలా వచ్చింది.. అసలు గుర్తుపట్ట లేకుండా ఉన్నాం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.