టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన దేవర మోస్ట్ ఎవైటెడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరికొద్ది గంటలో సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాపై ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవర సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఇప్పటికే టికెట్లు పెంపుకు, స్పెషల్ షోస్‌కు అదనపు పర్మిషన్లు తెచ్చుకున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే దేవర అర్ధరాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో కేవలం 29 థియేటర్లలో మాత్రమే దేవర ఒంటిగంట షోలు ప్రదర్శించబడుతున్నాయి. సెప్టెంబర్ 27న అర్ధరాత్రి దేవర ఒంటిగంట షో పడనుంది. ఇంతకీ ఆ థియేటర్స్ జాబితా ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. సుదర్శన్ 35 mm, దేవి 70mm, సంధ్య 35mm, సంధ్య 70 mm థియేటర్లలో.. 1AM షోలు ప్రదర్శితమవుతాయి. ఇక కుకట్‌పల్లిలో.. విశ్వనాథ, మల్లికార్జున, భ్రమరాంభ, అర్జున్ థియేటర్లలో సినిమాను స్క్రీనింగ్ చేయనున్నారు. ఎర్రగడ్డలో గోకుల్, మూసాపేట – శ్రీరాముల థియేటర్, అత్తాపూర్ – ఎస్విసి ఈశ్వర్, ఆర్ సి పురం – ఎస్విసి సంగీత, మల్కాజ్గిరి – శ్రీ సాయిరాం థియేటర్లలో సినిమా ప్రీమియర్ షోలో రిలీజ్ కానున్నాయి.
దిల్షుక్నగర్ కోణార్క్, కార్మాన్ ఘాట్ – ఎస్ వి సి శ్రీలక్ష్మి, మాదాపూర్ – బిఆర్ హైటెక్, గచ్చిబౌలి – ఏఎంబి సినిమాస్, అమీర్‌పేట్ – ఏఏఏ సినిమాస్, కూకట్పల్లి – పివిఆర్ నక్సస్ మాల్, ఎన్టీఆర్ గార్డెన్ – ప్రసాద్ మల్టీప్లెక్స్, నల్లగడ్డ – అపర్ణ థియేటర్స్, మిర్యాలగూడ – విట్రోసినీప్లెక్స్, మహబూబ్‌నగర్ – ఏవీడి తిరుమలా కాంప్లెక్స్, గద్వాల్ – ఎస్విసి మల్టీప్లెక్స్, ఖమ్మం, శ్రీ తిరుమల, వినోద, సాయిరాం, శ్రీనివాస, కెవిఎస్ ఆదిత్య థియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు. ఇలా మొత్తంగా తెలంగాణలో కేవటం 29 థియేటర్లలో స్పెషల్ షోలు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రీమియర్ షోల్ తోనే సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.. అనే దానిపై దేవర రిజల్ట్ ఆధారపడి ఉంది. ఒక సినిమా పాజిటివ్ టాక్ వస్తే దేవర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం. కాగా ప్రీమియర్ షోల తర్వాత దేవర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది వేచి చూడాలి.