నయన్, శ్యామ్, రష్మిక లకే షాక్ ఇచ్చిన ఆ క్రేజీ బ్యూటీ.. మ్యాటర్ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సౌత్ హీరోల రెమ్యూనరేషన్ ప్ర‌స్తుతం రూ.100 కోట్లకు చేరుకుంటే.. హీరోయిన్లు గరిష్టంగా రూ.10 నుంచి రూ.12 కోట్ల వ‌ర‌కు చార్జ్‌ చేస్తున్నారు. అలా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఎప్పుడూ నయన్, సమంత, రష్మిక మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన రెమ్యూనరేషన్‌తో ఈ స్టార్ హీరోయిన్స్ అందరికీ షాక్ ఇచ్చింది ఒక క్రేజీ బ్యూటీ. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో.. టాలీవుడ్ టాప్ టెన్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కథానాయికల లిస్ట్ అంటే ఒకసారి చూద్దాం.

sai pallavi beats rashmika mandanna samantha nayanathara in remuneration ksr

సౌత్ ఇండియన్ హీరోయిన్‌.. న్యాచురల్ బ్యూటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో టాప్ 10 లో నిలిచింది. ఈ అమ్మడు ప్రస్తుతం తన ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఇక కీర్తి సురేష్ తన ఒక్కో సినిమాకు రూ. కోట్ల అందుకుంటూ.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో 9వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక అనుష్క రూ.4 కోట్లు రెమ్యూనరేషన్తో 8వ స్థానాన్ని.. సమంత రూ.3నుమ‌చి రూ.5 కోట్ల రెమ్యూనరేషన్‌తో 7వ స్థానాన్ని.. రూ.5 కోట్ల రెమ్యూనరేషన్‌తో తమన్న 4వ‌ స్థానాన్ని.. రూ.5 కోట్ల రెమ్యూనరేషన్తో పూజ హెగ్డే ఐదవ స్థానాన్ని.. రూ.5 కోట్ల రెమ్యూనరేషన్‌తో రష్మిక నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.

నయనతారతో గొడవలు నిజమే.. విభేదాలపై ఓపెన్ అయిన త్రిష

ఇక అందరికీ షాక్ ఇస్తూ కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి తన ఒక్కో సినిమాకు రూ.7 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఇక నయన్‌ తన ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటూ టాప్ 2 లో నిలిచింది. అయితే ఇప్పటివరకు చాలామంది నయన్‌ సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటూ టాప్ వన్ హీరోయిన్ అనుకుంటారు. కానీ టాప్ వన్ పొజిషన్‌లో సౌత్ స్టార్ బ్యూటీ త్రిష నిలిచి అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఈమె తన ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది.