నాని.. ‘ సరిపోదా శనివారం ‘ బాక్స్ ఆఫీస్ శివతాండవం.. షురూ.. !

నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమా నేడు (ఆగ‌ష్టు) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా.. కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా.. ఈ సినిమాలో నటించి మెప్పించారు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో తోనే పాజిటీవ్ టాక్‌ తెచ్చుకొని దూసుకుపోతుంది.

Saripodha Sanivaaram: పరాయి దేశంలో నాని సంచలనం.. విజయ్ దేవరకొండ రికార్డు బ్రేక్ | Nani Starrer Saripodha Sanivaaram Movie Reaches 500K Dollar Mark In USA - Telugu Filmibeat

ఇప్పటికే దసరా, హాయ్ నాన్న‌ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నాని.. సరిపోదా శనివారంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా.. ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో కూడా అదరగొడుతుండగా.. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లోనూ శివతాండవం మొదలెట్టింది. అలాగే నాని కూడా ఎంతో కాన్ఫిడెంట్‌గా తన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. సరిపోదా శనివారం పోస్టర్ పై బాక్సాఫీస్ శివతాండవం అనే ట్యాగ్ ఉన్న పోస్టర్ను అభిమానులతో పంచుకున్నాడు.

దీంతో మొదటిరోజు సినిమా పూర్తికాక‌ ముందే.. గట్టి కలెక్షన్లు వసూలు చేస్తుందని.. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా ఇలాంటి పోస్టర్ నాని షేర్ చేసి ఉంటాడని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు జేక్స్ బిజియో సంగీతం అందించ‌గా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత హైలెట్గా నిలిచిందని.. ఎంతో మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.