మొదటి రెండు సినిమాలను చూసి.. నాగార్జునకు నటనే రాదన్నారు.. కట్ చేస్తే..!

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నాగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంభందించిన వార్త‌లు నెటింట వైర‌ల్‌గా మారుతున్నాయి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు నాగ్‌. వైవిధ్యమైన స్టైల్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈయన.. ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యూత్, లేడీ ఆడియన్స్ లో నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్‌ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. సినిమాలు చూడడానికి థియేటర్ల దగ్గర బారులు తీరిపోతూ ఉంటారు. కామెడీ, మాస్, ఫ్యామిలీ, లవ్ స్టోరీ, భక్తి రస సినిమాలు ఇలా ఏ జోనర్‌లో నాగార్జున సినిమాలు తెరకెక్కిన.. ఆడియన్స్ బ్రహ్మరథం పట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అలాంటి నాగార్జున స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చిన.. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడట. ఇంతకీ ఏం జరిగిందో.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నాగార్జున 1986లో విక్రమ్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ సార్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడం అంటే నాగ్ పై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన విక్రమ్ సూపర్ హిట్ టాక్‌ దక్కించుకుంది. ఓపెనింగ్స్ కూడా స్టార్ హీరోల రేంజ్ లో అందాయి. ఇక కమర్షియల్ గాను సూపర్ హిట్ సినిమాగా నిలిచినా.. సినిమాకు మాత్రం నెగటివ్ రివ్యూస్ ఎన్నో వచ్చాయి.

నాగార్జునకు అసలు నటన రాదంటూ, డ్యాన్స్ చేయలేకపోతున్నాడు అంటూ.. ఫైట్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి అంటూ.. అసలు నాగేశ్వరరావు గారి కొడుకుకి.. సినిమాలు సెట్ కావంటూ ఎన్నో కామెంట్స్ వినిపించాయట. మొదటి సినిమా తర్వాత ఆయన నుండి రిలీజ్ అయిన కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ సినిమాలు గోర డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో నాగార్జున నటనపై ఆడియన్స్ లో విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ని తీసుకున్న నార్‌ తనను తాను సెట్ రైట్ చేసుకున్నారు. మజ్ను సినిమాతో అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. భారీ బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత తను నటించిన ప్రతి సినిమాతో మరింత ప్రేరణ పెంచుకుంటూ వచ్చిన ఈయన.. నాలుగేళ్లలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు.

మాస్, రొమాంటిక్ రోల్స్ లోను, భక్తి రస సినిమాల్లోనూ ఆడియోస్ని ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ రోల్స్‌లో కనిపించిన ఏ హీరో అయినా.. భక్తిరస సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని భావిస్తారా.. కానీ నాగార్జున‌ అన్నమయ్య లాంటి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్గా నిలిచింది. ఇక నాగ్‌ ఎప్పుడు ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. అందుకే స్టార్ హీరోలలో నాగార్జునది ఓ స్పెషల్ ప్లేస్. ఇక కేవలం హీరోగానే కాదు, బిజినెస్ ్యాన్ గాను నాగార్జునది టాప్ ప్లేస్‌. ఇక ఇప్ప‌టికి టాలీవుడ్ కింగ్ నేటితరం హీరోలతోనూ పోటీ పడుతున్నాడు. అదే అందం, ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ ఇప్పటికి ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నాడు.