సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. వారు చిన్నప్పటి ఫొటోస్ నుంచి.. వాళ్ళు వేసుకునే బట్టలు, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, లగ్జరీ కార్స్ ఇలా ప్రతి ఒక్కదానిపై.. వాటి విలువ తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాడే షూస్ ఇవేనంటూ న్యూస్ నెటటింట వైరల్ గా మారుతుంది.
ఇంతకీ ఆ షూస్ ఏంటి.. వాటి స్పెషాలిటి, కాస్ట్.. వివరాలు ఒకసారి తెలుసుకుందాం. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బల్మెన్ షూస్ అలు హీరో బన్నీతో పాటు, మెగా హీరో పవర్ స్టార్ కూడా వాడతారని సమాచారం. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ ఈ బల్మెన్ బ్రాండ్‌కు సంబంధించినవేనట. ఈ బ్రాండ్ షూ కాస్ట్ దాదాపు రూ.40 వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంటుందని.. ఇక పవన్ కళ్యాణ్ ధరించిన ఈ షూస్ లక్షరూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇదే షూస్ బన్నీ కూడా పలు సందర్భాల్లో వేసుకున్నారట. ఇక ప్రస్తుతం వీరు వాడుతున్న ఈ ష్యూస్ కాస్ట్ తెలిసి ఒక్కొక్కరు ఆశ్చర్యపోతున్నారు. వామ్మో షూసే లక్ష రూపాయలా వింటేనే మైండ్ పోతుంది అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం పవర్ స్టార్ లెవెల్ కు ఈ మాత్రం ఉండాలి అంటూ.. బన్నీ రేంజ్ అది అంటూ కామెంట్లు చేస్తున్నారు.