నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దికాలం క్రితం రాఖి పేరుతో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్నవరం టైటిల్ తో సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్లోనే మరో సినిమాలో నటించి మెప్పించాడు. కేవలం వారం రోజుల గ్యాప్ తో రిలీజైన రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడం విశేషవ. రాఖీ సినిమా 2006 డిసెంబర్ 22న రిలీజ్ కాగా.. అన్నవరం సినిమా ఇదే ఏడాది డిసెంబర్లో 29న రిలీజ్ అయింది. ఇకపోతే ఈ రెండు సినిమాలపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి.
ఇందులో భాగంగానే రాఖీ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే ఆ తర్వాత సినిమా కలెక్షన్లు ఊహించిన రేంజ్ లో అందుకోలేకపోయింది. ఇకపోతే అన్నవరం సినిమాకు విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ.. తర్వాత కలెక్షన్ల పరంగా సినిమా బాగా పుంజుకుని మంచి వసూళ్లను రాబట్టింది. మరి వారం తేడాతో రిలీజ్ అయిన ఈ రెండు సిస్టర్ సెంటిమెంట్ సినిమాలకు టోటల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ముగిసే సరికి.. ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయో ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
రాఖీ మూవీ ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ.12 కోట్ల కలెక్షన్లను రాబట్టి యావరేజ్ సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమా బుల్లితెరపై ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. ఇప్పటికీ రాఖీ సినిమా వస్తుందంటే ఎంతో మంది ఆడియన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక అన్నవరం మూవీ టోటల్ బాక్సాఫీస్ రన్ ముగిసేసరికి రూ.20 కోట్ల కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక అన్నవరం సినిమాకు కూడా ప్రేక్షకుల్లో ఎలాంటి డిమాండ్ ఉందో చెప్పనవసరం లేదు.