రవితేజ పేరు వింటేనే భయపడిపోతున్న నిర్మాతలు..!

టాలీవుడ్ మాస్ మహారాజ్‌కి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో విక్రమార్కుడు, రాజా ది గ్రేట్, వెంకీ, భద్రా ఇలా వరుస బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లతో రికార్డులు సృష్టించిన మాస్ మహారాజ్.. 2017 తర్వాత ఒక్క సరైన హిట్ కూడా లేకపోవడంతో స‌త‌మ‌త‌మౌతున్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ ఇటీవల వచ్చిన‌ మిస్టర్ బ‌చ్చ‌న్‌ సినిమాలు అయితే ఘోరపరాజయం పొంది.. డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో మాస్ మహారాజులు నమ్ముకుని సినిమాలు తెర‌కెక్కించిన నిర్మాతలు భారీ లెవెల్ లో నష్టపోయారు. పీపుల్ మీడియ మొద‌లుకుని మైత్రి మూవీ మేకర్స్ వ‌ర‌కు రవితేజ సినిమాలకు ప్రొడ్యూస్ చేసిన ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇక రామ్ తాళ్లూరి అయితే రవితేజతో ఏకంగా రెండు సినిమాలను తీసి కోలుకోలేని విధంగా తీవ్ర నష్టాలను పెవిచూశాడు.

Mr. Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ - NTV Telugu

రవితేజ మొద‌ట్లో ఒక్కో సినిమాకు పది కోట్లు తీసుకునేవారు. కానీ.. ఇప్పుడు ఏకంగా రూ.25 కోట్ల రెమ్యున‌రేషన్ అందుకుంటున్నారు. సాధారణంగా ఓ హీరో సినిమాలు వరుసగా ప్లాప్స్ అవుతుంటే.. వాళ్ళ రెమ్యున‌రేష‌న్‌ మరింతగా తగ్గుతుంది. అయితే రవితేజ రెమ్యూనరేషన్ మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ఈయన సినిమాకు ఏకంగా రూ.25 కోట్ల రమ్య‌న‌రేషన్‌ అందుకుంటున్నడని టాక్. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. తెలుగులో ఉన్న నిర్మాతలు అంతా దాదాపు రవితేజ వల్ల‌ నష్టపోయిన వారే అనడంలో సందేహం లేదు. ఇక మిగతా నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు తీసే అవకాశం ఉందా.. ఆయన ఫ్లాప్ రికార్డ్ చూసిన తర్వాత మరే ప్రొడ్యూసర్ అయినా ఆయనతో సినిమా చేసే సాహసం చేయగలరా.. అంటూ నెటింట‌ చర్చలు మొదలయ్యాయి. అయితే సితార సినిమాకు ఓ అద్భుతమైన కథ దొరికిందట‌. అందుకే రవితేజతో సినిమా చేయడానికి వారు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇందులో రవితేజ పోలీస్‌గా కనిపించనున్నాడు.

Eagle Twitter Review: Netizens Shower Praise On Ravi Teja's Performance |  Telugu News, Times Now

కాగా మూవీ కి దర్శకుడు కొత్తవాడు. ఇక‌ సితార సినిమాస్ అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. కనుక ఆశ్చర్యపోనవసరం లేదు. దిల్ రాజు, అశ్వినీ ద‌త్త్‌ కూడా రవితేజతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న నిర్మాతల లిస్టులోకే వస్తారు. ఈ క్రమంలో వీరు రవితేజతో సినిమాలు చేయడానికి ముందుకు రాకపోవచ్చు.. మరి ఇండస్ట్రీలో మిగిలిన ప్రొడ్యూసర్స్ లో ఎవరు రవితేజతో సినిమా తీసేందుకు సాసిస్తారో లేదో వేచి చూడాలి. ఇక వరుస ప్లాపులతో ఉన్న రవితేజ.. థియేట్రిక‌ల్‌ మార్కెటేకాదు.. నాన్‌థియెట్రికల్ మార్కెట్ కూడా బీభత్సంగా పడిపోయింది. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతాయేమో అని సందేహంతో.. ఎవరు కూడా ముందుగా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం మానేశారు. అంతేకాదు ఓటీటీ రైట్స్ రూ.15 కోట్లు కూడా దాటడం లేదు. ఇక థియేటర్ హక్కులైతే రూ.30 కోట్లు మించి వెళ్లడం లేదు. ఇక ప్రస్తుతం రవితేజ తన కెరీర్ లో ఎదురవుతున్న ఇలాంటి తీవ్ర స్ట్రగుల్స్ నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి.