పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఎన్ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఖుషి అనే లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా భూమిక హీరోయిన్గా.. ఎస్. జె. సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది. మంచి అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ స్టార్ హీరోగా మరింత పెరిగింది. ఈ క్రమంలో భూమికకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి.అలాగే మూవీకి దర్శకత్వం వహించిన ఎస్‌జే సూర్యకు కూడా ఈ మూవీ ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే ఇటీవల కాలంలో సినిమాలకు దర్శకత్వం వహించడం కంటే.. సినిమాల్లో నటించడానికి ఎక్కువ మకువ చూపుతున్నాడు. అందులో భాగంగా సినిమాలో నటిస్తున్న ఈయన.. తాజాగా నాని హీరోగా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా.. వివేకాత్రియ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సరిపోదా శనివారం సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఈ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలో ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. పవన్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆయన పవన్ గురించి మాట్లాడుతూ ఖుషి మూవీ తర్వాత పవన్ కి ఓ లవ్ స్టోరీని కూడా వినిపించానని.. అప్పుడు ఆ కథ బాగుందన్నారు. కానీ.. కొంత టైం తర్వాత చేద్దామని చెప్పారని.. ఆ తర్వాత ఆయన బిజీ అయిపోయారు లేకుంటే ఆ సినిమా ఆ టైంలో రిలీజ్ అయి ఉంటే.. పవన్ మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునేవాడు అంటూ తాజాగా వివరించాడు. ప్రస్తుతం ఎస్.జే.సూర్య చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.