ఈ ఫోటోలో అమ్మతో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చిన కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. అమాయకంగా చూస్తూ ముద్దొస్తున్న ఈ బుడ్డోడు టాలీవుడ్ మ్యాన్లీ హీరో. తను నటించిన ప్రతి సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్న ఈ హీరో.. కేవలం హీరోగా మాత్రమే సినిమాల్లో నటించకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తే ఎలాంటి సినిమాలు కైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూ విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. కొంతమంది హీరో రోల్స్లో నటిస్తున్నామంటే కేవలం అది హీరోగా మాత్రమే పరిమితం చేసుకొని.. గిరి గీసుకుని కూర్చుంటారు.. అలాంటి వారికి అరుదుగా మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు మాత్రం తన టాలెంట్ చూపేందుకు ఏ అవకాశం వచ్చినా చేజార్చుకోరు.
తన స్కిల్స్ బయటపెట్టే పాత్ర ఎలాంటిదైనా సరే నటించడానికి సిద్ధమవుతూ ఉంటాడు. పాత్ర నడివి, పాటలు, ఫైట్స్ గురించి ఆలోచించకుండా.. సినిమాలో ఆ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ ఎంత అని మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటివారు టాలీవుడ్ లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు. వారిలో యంగ్ అండ్ మ్యాన్లీ హీరో నవీన్ చంద్ర కూడా ఎక్కరు. ఓవైపు తనకు తగ్గ హీరో పాత్రలో నటిస్తూనే.. మరోవైపు ఇతర హీరోల సినిమాలోను కీరోల్స్ పోషిస్తూ రాణిస్తున్నాడు. అవకాశం వస్తే తనలోని నటన సత్త చాటేందుకు.. విలన్ గా కనిపించడానికి కూడా సిద్ధం అంటున్నాడు. ఇక నవీన్ చంద్ర మన తెలుగు అబ్బాయి కావడం విశేషం. బళ్లారిలోని దేవినగర్ లో పుట్టిన ఈయన.. తండ్రి కర్ణాటక రోడ్డు రవాణా సంస్థలో హెడ్ మెకానిక్ పనిచేశారు. ఇక నవీన్ చంద్ర మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమాను పూర్తి చేశాడు.సినీ ఇండస్ట్రీకి రాకముందు మల్టీమీడియా యానిమేటర్‌గా పనిచేసిన నవీన్.. 2006లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో అతనికి మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత హీరోగా నిలదొక్కుకున్నందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మార్కెట్ రేంజ్ పెరిగిపోవడంతో.. నేను లోకల్ సినిమాలో విలన్ పాత్రకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమా తర్వాత నవీన్‌కు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అరవింద సమేత వీర రాఘవ మూవీలో తన నటన మరో లెవెల్‌లో ఉంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన భానుమతి రామకృష్ణ సినిమాతోను రీసెంట్ హిట్ అందుకున్న నవీన్.. వీరసింహారెడ్డి సినిమాల్లో తననటనకు మంచి మార్కులు కొట్టేసాడు. ప్రస్తుతం ఎలెవెన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతను.. తన తల్లితో కలిసి క్యూట్ లుక్స్ తో చూడగానే ముద్దొస్తున్న చిన్నప్పటి ఫోటో ఒకటి నెటింట తెగ వైరల్ గా మారుతుంది.