టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో సినిమాలు తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకోవడమే కాదు.. ఇండస్ట్రియల్ హిట్లు సాధించి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఇండస్ట్రియల్ హిట్స్‌గా ఉండటమే కాదు.. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. అభిమానులకు మాత్రమే కాదు.. సినీ లవర్స్ కూడా ఆ సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కూడా ఒకటి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్న రోజుల్లో రిలీజ్ అయిన ఇంద్ర సినిమా అప్పట్లో థియేటర్స్ వద్ద సునామీ సృష్టించింది. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అప్పట్లోనే ఈ సినిమా ఏకంగా రూ.28 కోట్ల షేర్ వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాదు 151 కేంద్రాల్లో 50 రోజులు.. 120 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సెన్సేషన్ సృష్టించింది.ఇక 32 కేంద్రాల్లో అయితే ఏకంగా 175 రోజులు ఆడి.. అప్పట్లో ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. అలాంటి సినిమా రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ బి. గోపాల్ షూటింగ్ టైంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ సినిమాల్లో దాయి.. దాయి.. దమ్మ పాట అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ పాటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సాంగ్ లో చిరు వేసిన వీణ స్టెప్ ఇప్పటికి ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఈ పాటను ఎన్నోసార్లు రిపీట్ చేస్తూ.. బుల్లితెరపై చూసే ఆడియన్స్ కూడా లక్షల్లో ఉన్నారు. అయితే ఈ పాట మేకింగ్ టైం లో చిరంజీవి పడిన కష్టం గురించి బి.గోపాల్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు కొరియోగ్రాఫర్ వేయించే.. చెప్పేది.. బాగా అర్థం చేసుకొని ఒకే ఒక్క టేక్ లో చూపించగలరని వివరించాడు.కానీ.. వీణ స్టెప్ కోసం మాత్రం ఆయన ఎంతో కష్టపడ్డారని.. దానికోసం ఆయన ప్రత్యేకంగా ఐదు గంటలు పాటు ప్రాక్టీస్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు. లారెన్స్ మాస్టర్ పర్ఫెక్ట్ గా వచ్చింది.. రిహార్సల్స్ అవసరం లేదు అన్నయ్య అని చెప్పినా.. చిరంజీవి మాత్రం మాట వినలేదని.. చేయాల్సిందే అని పట్టుబట్టి మరీ తన మనసుకి పూర్తిగా సంతృప్తి అనిపించే వరకు ప్రాక్టీస్ చేశారని.. చిరులో సినిమాల పట్ల తపన, కసి అలా ఉండేవని.. ఏ హీరోల్లో కూడా ఇది నేను చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బి.గోపాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో.. చిరు అభిమానులు దట్ ఇజ్ మెగాస్టార్ అంటూ.. వర్క్ డెడికేషన్ అంటే అలానే ఉంటుంది అంటూ.. తన ప్రొఫెషన్ కోసం అంత కష్టపడ్డారు కనుకే.. ఇప్పుడు ఆయన మెగాస్టార్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.